Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctors Continue Surgery: జపాన్‌లోని కుమమొటోలో సంభవించిన భారీ భూకంపం వేళ ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాల కంటే బాధ్యతే ముఖ్యమని నిరూపిస్తూ వైద్యులు, నర్సులు చూపించిన ధైర్యం నెటిజన్లను కదిలిస్తోంది. దీంతో నెట్టిజన్లు వారి ధైర్యాన్ని కొనియాడుతూ.. నిజమైన దేవుళ్లు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కుమమొటో ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో ఓ ఆస్పత్రిలో సర్జరీ జరుగుతోంది. భూకంపం కారణంగా ఆస్పత్రి భవనం ఒక్కసారిగా బలంగా ఊగిపోయింది. దీంతో ఆపరేషన్ థియేటర్లో ఉన్న వైద్యులు, నర్సులు కూడా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
అయినప్పటికీ సాధారణ పౌరుల వలే వారు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీయలేదు. కర్తవ్య నిర్వాహణలో ఉన్న వాళ్లు ఆపరేషన్ మధ్యలో ఉన్న రోగిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. వైద్య బృందం.. పేషెంట్ చుట్టూ రక్షణగా నిలబడి, ఆపరేషన్ టేబుల్‌ను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. భవనం ఊగుతున్నప్పటికీ ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా సర్జరీని విజయవంతం కొనసాగించారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా వైద్యులు ఎంతో ప్రశాంతంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. చివరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ ప్రాణాలను కాపాడటంలో వైద్య బృందం సక్సెస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించినట్లు చెబుతున్న సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోను చూసిన నెటిజన్లు వైద్యుల అంకితభావం, ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ కొనియాడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ తమ బాధ్యతను మరవకుండా రోగి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన వైద్యులకు సెల్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
VIRAL: ప్రాణాల కంటే బాధ్యత గొప్పదని నిరూపించిన వైద్యులు!
జపాన్‌లోని కుమమొటోలో సంభవించిన 7.1 తీవ్రత భూకంపం సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రపంచాన్ని కదిలిస్తోంది.
భూకంపం కారణంగా ఆస్పత్రి భవనం బలంగా ఊగిపోతున్నా… ఆపరేషన్ థియేటర్లో ఉన్న వైద్యులు, నర్సులు మాత్రం భయంతో బయటకు పరుగులు… pic.twitter.com/8bT4Pr5PXw
— Tupaki (@tupaki_official) August 7, 2026
తాజావార్తలు
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!