Dead Body in Parcel: పార్శిల్‌లో డెడ్‌బాడీ.. పశ్చిమగోదావరి జిల్లాలో షాకింగ్ ఘటన!
- యండగండిలో షాకింగ్ ఘటన
- పార్శిల్‌లో డెడ్‌బాడీ
- పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పార్శిల్‌లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో.. యండగండిలో కలకలం రేపింది. మృతదేహం చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
యండగండి గ్రామంలో నివాసం ఉంటుంన్నముదునూరి రంగరాజు (55)కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పెద్దమ్మాయి సాగి తులసికి శ్రీనివాసరాజుతో వివాహం కాగా.. నిడదవోలులో నివాసం ఉండేది. శ్రీనివాసరాజు అప్పులు చేసి పది సంవత్సరాల క్రితం ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో.. తులసి తిరిగి యండగండి గ్రామం వచ్చేసింది. ప్రస్తుతం గరగపర్రు గ్రామంలో నివాసం ఉంటూ.. భీమవరం దుర్గ స్టిల్స్ లో ఉద్యోగం చేసుకుంటుంది. ఈమెకు ఒక కూతురు ఉంది. తులసికి యండగండి గ్రామం జగనన్న కాలనీలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా.. ఇల్లు నిర్మిస్తోంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ప్రస్తుతం తులసి ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడతలో పెయింట్ డబ్బాలు, టైల్స్ అందజేసింది. తులసి తల్లితండ్రులు యండగండిలో ఉండటంతో.. వారి అడ్రస్ కి సేవా సమితి ఇంటి సామాన్లు పంపిస్తోంది. విద్యుత్ సామగ్రి కొరకు తులసి మరోసారి ఆర్థిక సాయంకు దరఖాస్తు చేసుకుంది. పార్శిల్‌లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. అది చూసి తులసి సహా కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉంది. రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అందులో రాసుంది. తులసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్‌లో సుమారు 45 ఏళ్ల వయసున్న మగ వ్యక్తి మృతదేహంను గురించారు. దర్యాప్తు కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!