వీధి కుక్కల బెడదపై ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్‌గా ఉంది. వీధి కుక్కలను షెల్టర్లకు పంపించాలంటూ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక పార్లమెంట్ పరిధిలో పెంపుడు కుక్కలను తీసుకురావడం పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాత్రం పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి తన పెంపుడు కుక్కతో వచ్చారు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge-BJP: వీడ్కోలు లేకుండానే ధన్‌ఖర్‌ను పంపేశారు.. ఖర్గేకు బీజేపీ కౌంటర్
రేణుకా చౌదరి తీరుపై బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. ఎంపీలకు ఉన్న ప్రత్యేక హక్కులు దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నారు. ప్రత్యేక అధికారాలు నిబంధనలు ఉల్లంఘించడానికి కాదని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?
బీజేపీ నేతలకు రేణుకా చౌదరి కౌంటర్ ఇచ్చారు. నిజమైన కుక్కలు ఎటువంటి హానీ చేయవని.. కరిచే వ్యక్తులే పార్లమెంట్ లోపల ఉంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా పెంపుడు కుక్క ఎలాంటి హాని చేయదని.. తన కుక్క చాలా చిన్నది అని.. ఇప్పటి వరకు ఎవరినీ కరవలేదని పేర్కొన్నారు. బయట కుక్కలు ఏమి చేయవని.. లోపల ఉన్నవాళ్లే కాటు వేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
जानवरों को पसंद नहीं करती है ना ये सरकार?
गूंगा जानवर … गाड़ी में आये और चले गए !
तो इनको क्या तक़लीफ़ है? pic.twitter.com/T1CrQxrfjo
— Renuka Chowdhury (@RenukaCCongress) December 1, 2025