Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?
- వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ
- హాట్‌హాట్‌గా మదురో-ట్రంప్ మధ్య ఫోన్ కాల్
- పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నట్లు సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై ఎప్పుడూ కారాలు.. మిరియాలు నూరే ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు. అయితే ఈ సంభాషణ కూడా కూల్.. కూల్‌గా కాకుండా.. హాట్‌హాట్‌గానే సాగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి వెనిజులా నుంచి లాటిన్ అమెరికాలోని ఇతర ప్రాంతాలకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని సముద్రంలో అమెరికా దాడులు చేస్తోంది. ఇప్పటికే చాలా మంది స్మగ్లర్లు హతమయ్యారు. ఈ ఘటనలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అలాంటిది శనివారం మదురోతో ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక వెనిజులా అధ్యక్షుడు మదురోతో మాట్లాడానని.. కాకపోతే ఆ వివరాలు చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Indonesia Floods: ఇండోనేషియాలో జల విలయం.. 442 మంది మృతి
Also Read
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
- 9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
అయితే మయామి హెరాల్డ్ నివేదిక ప్రకారం.. నికోలస్ మదురో సురక్షితంగా దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని ట్రంప్ కల్పించినట్లు తెలుస్తోంది. అది కూడా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని సూచించినట్లు సమాచారం. ఇలా ఇద్దరి మధ్య హాట్‌హాట్ సంభాషణ జరిగినట్లుగా పేర్కొంది. అయితే తనకు, తన సహచరులకు ఆపాదించబడిన నేరాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా క్షమాభిక్ష కల్పించాలని.. అలాగే సాయుధ దళాలపై నియంత్రణ కల్పించాలని మదురో కోరినట్లు తెలుస్తోంది. అయితే తక్షణ రాజీనామాతో సహా వెంటనే దేశం విడిచివెళ్లడాన్ని మదురో నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Elon Musk: భార్య, కొడుకు గురించి ఇంట్రెస్టింగ్ మేటర్ చెప్పిన మస్క్
అయితే ఇద్దరి మధ్య చర్చలు విఫలమవడంతో ట్రంప్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. వెనిజులా రాజధాని కారకాస్‌పై ఒత్తిడిని పెంచుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక కార్యకలాపాలు అతి త్వరలోనే వెనిజులాలో ప్రారంభమవుతాయని ట్రంప్ హెచ్చరించారు. వెనిజులా వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేతకు ట్రంప్ ఆదేశించారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్, మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ ఆఫ్‌పోర్ తీరంలో మోహరించినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా చర్యలను మదురో ఖండించారు. దురాక్రమణగా అభివర్ణించారు. వెనిజులా చమురు నిల్వలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!