బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ యాస్ ఒడిశాతీరం వైపు దూసుకొస్తున్నది. 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ఒడిశాలోని చాంద్‌బలి-దామ్ర పోర్ట్ కు సమీపంలో తీరం దాటనున్నది. ప్రస్తుతం పారాదీప్‌కు 90 కి.మీ, బాలాసోర్‌కు 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు మధ్యాహ్నం వరకు తుఫాన్ తీరం దాటనున్నది. యాస్ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 165 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలోని అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ను బులెటిన్‌ను రిలీజ్ చేసింది వాతావరణ శాఖ. దీంతో బెంగాల్ తీరప్రాంతం నుంచి 11 లక్షల మందిని, ఒడిశా తీర ప్రాంతం నుంచి 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాస్ తుఫాన్ తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.