బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ బాలాసోర్ వద్ద తీరం దాటింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా తీరప్రాంతం మొత్తం అతలాకుతలం అయింది. ఒడిశాలోని 9 జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా భద్రక్ జిల్లాపై పడింది. భద్రక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ వేగంతో గాలులు వీస్తుండటంతో చెట్లు విరిగి పడుతున్నాయి. ఇక సముద్రంలోని అలలు ఎగసి పడుతున్నాయి. ఇక బాలేశ్వర్‌లోని చాందిపూర్ లో…
బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాన్ యాస్ ఒడిశాతీరం వైపు దూసుకొస్తున్నది. 12 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ఒడిశాలోని చాంద్‌బలి-దామ్ర పోర్ట్ కు సమీపంలో తీరం దాటనున్నది. ప్రస్తుతం పారాదీప్‌కు 90 కి.మీ, బాలాసోర్‌కు 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు మధ్యాహ్నం వరకు తుఫాన్ తీరం దాటనున్నది. యాస్ తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 165 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలోని అలలు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ…
యాస్ తుఫాన్.. తీవ్ర తుఫాన్‌గా మారుతుండడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. తుఫాన్ ప్రభావం భారీగా ఉండే ప్రాంతాల్లో ముందుగానే అలర్ట్ అయ్యారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఎన్‌డీఆర్‌ఎఫ్.. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌లోని 14 జిల్లాల పరిధిలో 8,09,830 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.. యాస్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. ఇక, యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. 11…
యాస్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలను తీసుకోవాలన్న సీఎం.. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఇక, శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను వివరించారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం…
తౌక్టే తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో తుఫాన్ దూసుకొస్తుంది.. ఈనెల 23వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది.. ఈ అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.. యాస్ తుఫానుగా పిలుస్తున్న ఈ తుఫాన్.. ఈనెల 26 నుంచి 27 మధ్య వాయువ్య దిశగా కదులుతూ…