“టక్ జగదీష్” రిలీజ్ డేట్ ఫిక్స్ ?

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోలేదు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల వాయిదా వేసుకున్నాయి. ఒకవేళ థియేటర్లు రీఓపెన్ అయితే సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ ఇతర చిత్రాలు వేసవిలో విడుదల కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఆ చిత్రాలన్నీ తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నాయి. అంతేకాకుండా థియేటర్లు రీఓపెన్ అయ్యేదాకా తమ సినిమాలను విడుదల చేసేది లేదంటున్నారు. తాజా సమాచారం ప్రకారం కరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదల కానున్న మొదటి చిత్రం నాని “టక్ జగదీష్”. ఈ చిత్రం జూలై 30న భారీ స్థాయిలో విడుదల కానుంది. సినిమా రిలీజ్ గురించి మేకర్స్ ఈ వారాంతంలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

Read Also : ఓటిటి కోసం రాశిఖన్నా క్రేజీ రోల్ ?

నాని కూడా ఈ రిలీజ్ డేట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మేకర్స్ “టక్ జగదీష్” ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై “టక్ జగదీష్” నిర్మించింది. సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ ఎప్పుడో క్లోజ్ అయ్యాయి. నాగ చైతన్య “లవ్ స్టోరీ” ఆగస్టు 13న తెరపైకి రానుంది. సత్యదేవ్ “తిమ్మరుసు” జూలై 30న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం “ఎస్ఆర్ కళ్యాణమండపం” ఆగస్టు 6న తెరపైకి వస్తుంది. రాబోయే రెండు వారాల్లో సినిమాల రిలీజ్ కు సంబంధించిన వరుస అప్డేట్స్ రానున్నాయి అంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరవడం గురించి చర్చించడానికి అగ్ర నిర్మాతలు, పంపిణీదారులు రోజూ సమావేశమవుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-