Reasi bus attack: రియాసి బస్ అటాక్.. ఎన్ఐఏ సోదాల్లో కీలక విషయాలు..
- రియాసి బస్సు అటాక్ కేసులో ఎన్ఐఏ విచారణ..
- రాజౌరీలో పలు ప్రాంతాల్లో సోదాలు..
- టెర్రరిస్టులతో పలువురు స్థానికులతో సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reasi bus attack: రియాసిలో బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను వేగవంతం చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అంతకుముందు ఈ కేసును జూన్ 15న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విచారణను ఎన్ఐఏకి అప్పగించింది. రియాసి జిల్లాలోని శివ్ ఖోరి నుంచి మాతా వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బస్సు లోయలో పడిపోవడంతో 10 మంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.
Read Also: Andhra Pradesh: ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా
Also Read
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
ఈ కేసులో హైబ్రీడ్ ఉగ్రవాదులకు స్థానికంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారితో సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీరితో సంబంధం ఉన్న ఐదు ప్రదేశాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. అరెస్టైన టెర్రరిస్ట్ హకమ్ ఖాన్ దాడికి సంబంధించిన లొకేషన్లను కాల్పులు జరిపిన ఉగ్రవాదులకు చూపించాడు. జూన్ 9న జరిగిన ఈ దాడిలో ఉగ్రవాదులకు హకమ్ సురక్షిత ఆశ్రయం, లాజిస్టిక్, ఆహారాన్ని అందించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దాడికి గురైన యాత్రికుల్లో ఎక్కువ మంది రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ నుంచి వచ్చారు.
సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులకు ఉగ్రవాదులకు, స్థానికంగా ఉగ్రవాద సానుభూతిపరులుగా ఉన్న వారికి మధ్య సంబంధాలను చూపించే కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 50 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులో ఉన్నారు. పూంచ్‌లో మే 4న భారత వైమానిక దళ కన్వాయ్‌పై దాడి చేసిన అదే పాకిస్తానీ టెర్రరిస్టులు ఈ దాడిలో కూడా పాల్గొన్నట్లు ఇంటెజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ దాడికి ముందుగా లష్కరేతోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత ప్రకటించుకుంది. ఆ తర్వాత తన ప్రకటనను ఉపసంహరించుకుంది.
తాజావార్తలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!