పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) ప్రకారం అర్హులైన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే మొబైల్ యాప్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
భారత్‌లో అమలవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అమెరికా గాయని మేరీ మిల్బెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. విశ్వాసం కారణంగా చిత్రహింసలకు గురైన ప్రజల పట్ల ప్రధాని మోడీ దయతో కూడిన దృక్పథాన్ని అవలంబిస్తున్నారని, వారికి భారత్‌లో నివాసం కల్పిస్తున్నారన్నారు.
సీఏఏపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) రాజ్యసభ ఎంపీ, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం గురువారం అన్నారు. సీఏఏ అమలును సవాల్ చేస్తూ ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Kamal Haasan: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు దేశాన్ని విభజించేందుకు సీఏఏని అమలు చేశారని కమల్ హాసన్ ఆరోపించారు. శ్రీలంక తమిళులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. దేశ సామరస్యాన్ని నాశనం చేస్తుందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజల్ని విభజించి, సామరస్యాన్ని శాననం చేయడానికి ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో గెలవాలనే తపనతో,…
CAA: కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ని నోటిఫై చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చే ఈ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కేంద్రం చట్టాన్ని అమలు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. పలు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మాత్రం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోంది.
పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) సంబంధించి దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. దేశవ్యాప్తంగా సీఏఏపై చర్చ మరోసారి తీవ్రమైంది. ఇంతకు ముందు కూడా పౌరసత్వ సవరణ చట్టంపై చాలాసార్లు వివాదాలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ నేటి నుంచి అమలులోకి రాబోతుందంటూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది.
త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వివాదస్పదమైన 'పౌరసత్వ సవరణ చట్టం-2019'పై ఇవాళే రూల్స్ నోటిఫై చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల తర్వాత నేడు వాస్తవరూపం దాల్చనున్నట్లు సమాచారం.
Citizenship Rules: పొరుగు దేశాల నుంచి మతపరమైన వివక్ష ఎదుర్కొని, అక్కడ మైనారిటీలుగా ఉండీ, భారత్‌లో స్థిరపడిన వారికి పౌరసత్వం ఇచ్చే ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)’ వచ్చే నెలలో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఏఏ అమలు 2019లో దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. అయితే, ఇటీవల బీజేపీ నేతలు త్వరలోనే సీఏఏ అమలు అవుతుందనే వ్యాఖ్యలు చేశారు.
CAA: కేంద్రమంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలులోకి వస్తుందని ప్రకటించారు. రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, భారత్ అంతటా CAA అమలు చేయబడుతుందని నేను హామీ ఇవ్వగలను అని చెప్పారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్‌లోని కక్‌ద్వీప్ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ఈ హామీని ఇచ్చారు.