Rahul Gandhi: అమరావతిలో రాహుల్ గాంధీ బ్యాగ్స్ చెక్ చేసిన ఈసీ..
- రాహుల్ గాంధీ బ్యాగుల్ని చెక్ చేసిన ఈసీ అధికారులు..
- మహారాష్ట్ర అమరావతి ప్రచారంలో ఘటన..
- ఈసీ తీరును తప్పుబడుతున్న కాంగ్రెస్, ఇండియా కూటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. ఇదిలా ఉంటే, ఆ రాష్ట్రంలో ప్రధాన నాయకుల బ్యాగుల్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీల కీలక నేతల లగేజీ చెక్ చేస్తున్నారు. తాజాగా శనివారం, మహారాష్ట్రలోని అమరావతికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగుల్ని ఎన్నికల సంఘం తనిఖీ చేసింది. ఇండియా కూటమి నేతల్ని మాత్రమే ఈసీ టార్గెట్ చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఈ చెకింగ్ జరిగాయి.
Read Also: Rajasthan:పెళ్లైన 10 నెలలకే భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. కారణం?AP Assembly: టిడ్కో ఇళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. అసెంబ్లీ సోమవారానికి వాయిదా
Also Read
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Explainer: ఆ నగరాలు మునిగిపోతున్నాయి..! UN నివేదికలో షాకింగ్ నిజాలు!
- Teachers Day 2026: ఉపాధ్యాయులతో ప్రధాని మోడీ సంభాషణ.. టీచర్స్ డే సందర్భంగా కీలక సందేశం
- Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్‌పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
జార్ఖండ్ రాష్ట్రంలో శుక్రవారం రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. అయితే, ఆయన హెలికాప్టర్ టేకాఫ్ కాకుండా చాలా ఆలస్యం చేసినందుకు కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంక్షల కారణంగా గాంధీ హెలికాప్టర్‌ను టేకాఫ్‌కు అనుమతించడం లేదని, దీంతో ఆయన బహిరంగ సభలు ఆలస్యమవుతాయని లేదా రద్దయ్యాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు.
అయితే, ఈ బ్యాగుల తనిఖీలు మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిగా మారాయి. శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, బీజేపీ నాయకులకు సంబంధించిన బ్యాగుల్ని ఇలాగే తనిఖీ చేస్తారా..? అని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ ఈ తనిఖీలను సమర్థించింది. గత కొన్ని రోజుల క్రితం ఈసీ బీజేపీ నేతలైన నితిన్ గడ్కరీ, అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, ఎన్డీయే మిత్రపక్షం అజిత్ పవార్ బ్యాగుల్ని తనిఖీ చేసిన వీడియోలను షేర్ చేసింది.
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!