Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wakefit Sleep Internship Season 5 Winner: హాయిగా నిద్రపోతే ఆరోగ్యమే కాదు, భారీగా డబ్బు కూడా సంపాదించవచ్చని నిరూపించింది ముంబైకి చెందిన జినియా ఛటర్జీ (Jiniya Chatterjee). ప్రసిద్ధ మ్యాట్రెస్ బ్రాండ్ వేక్‌ఫిట్ (Wakefit) నిర్వహించిన ‘స్లీప్ ఇంటర్న్‌షిప్’ (Sleep Internship) సీజన్ 5 విజేతగా నిలిచి, ఏకంగా రూ.9.6 లక్షల ప్రైజ్ మనీ (Prize Money) తో పాటు ఒక ఉచిత స్పాన్సర్డ్ వెకేషన్ (Sponsored Vacation) గెలుచుకుంది. ఈ వినూత్నమైన రెండు నెలల కాంపిటీషన్ (Competition) కోసం భారతదేశం నలుమూలల నుంచి 2 లక్షలకు పైగా అప్లికేషన్లు (Applications) రాగా, కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేశారు. రోజూ కంటినిండా నిద్రపోవడం, సరైన నిద్ర వేళలు పాటించడం, ప్రతి వారం ఇచ్చే ఆసక్తికరమైన టాస్క్‌లు పూర్తి చేసి లీడర్‌బోర్డ్ (Leaderboard) లో టాప్‌లో నిలవడమే ఈ ఇంటర్న్‌షిప్ ముఖ్య ఉద్దేశం.
ఈ 60 రోజుల వ్యవధిలో పార్టిసిపెంట్స్ (Participants) అందరూ తమ స్లీప్ ప్యాటర్న్స్ (Sleep Patterns) ట్రాక్ చేసుకుంటూ, తమ నిద్ర నాణ్యతను పెంచుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ కాంపిటీషన్ కేవలం పడుకోవడానికే పరిమితం కాలేదు. వారానికోసారి వారి క్రియేటివిటీ (Creativity) ని పరీక్షించే సరదా ఛాలెంజ్‌లు కూడా నిర్వహించారు. అందులో సినిమాలు, స్లీప్ థీమ్‌ను కలిపి సీన్స్ రీక్రియేట్ చేసే ‘స్లీప్ సినిమా’ (Sleep Cinema), వారంలో తమ నిద్ర అలవాట్లను సమీక్షించుకునే ‘స్లీప్ బింగో’ (Sleep Bingo) వంటివి ఉన్నాయి.
Also Read
- Virat Kohli Record: చేసింది ఏడూ పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
- Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సెన్సేషన్
- India Head Coach Role: టీమిండియా కోచ్ పదవి అంటే 'ముళ్ల కిరీటమే'..
- Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
అంతేకాకుండా ‘అండర్‌కవర్ స్లీప్ మిషన్’ (Undercover Sleep Mission) అనే టాస్క్‌లో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా ఒక సంభాషణలో “బ్లాంకెట్” (Blanket) లేదా “పిల్లో” (Pillow) అనే పదాలను 10 సార్లు వాడాల్సి ఉంటుంది. ప్రతి వారం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ‘ప్రో స్లీపర్ ఆఫ్ ది వీక్’ (Pro Sleeper of the Week) బిరుదు ఇచ్చేవారు.
పోటీ ముగిసేసరికి రత్నగిరి మణికండన్, జినియా ఛటర్జీ మరియు మెహక్ ఖోత్ టాప్ 3 కంటెస్టెంట్స్‌గా నిలిచారు. అయితే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ (Wildcard Entry) రూపంలో హైదరాబాద్‌కి చెందిన కరీమ్ ఖాన్ మళ్లీ రేసులోకి వచ్చాడు. అత్యధికంగా వారపు క్రియేటివ్ ఛాలెంజెస్ గెలుచుకోవడం వల్ల అతనికి ఈ అవకాశం లభించింది. ఈ నలుగురు ఫైనలిస్టులతో ‘బిగ్ బెడ్’ (Big Bedd) పేరుతో రియాలిటీ టీవీ షో (Reality TV Show) తరహాలో గ్రాండ్ ఫినాలే (Grand Finale) నిర్వహించారు. అక్కడ వారికి కొన్ని ప్రత్యేకమైన టాస్క్‌లు ఇచ్చి, చివరిగా ఒక రాత్రి వారి నిద్ర పనితీరును ట్రాక్ చేశారు. ఒక టాస్క్‌లో భాగంగా రెఫరెన్స్ ఇమేజెస్ చూసి బెడ్రూమ్ సెటప్‌ను యథాతథంగా పునర్నిర్మించే ‘మెమరీ ఫోమ్ ఛాలెంజ్’ (Memory Foam Challenge) నిర్వహించారు. ఇది పోటీదారుల మెమరీ, పరిశీలనా శక్తి, టీమ్‌వర్క్ (Teamwork) ను పరీక్షించింది.
ఆ తర్వాత జరిగిన ‘స్లీప్ ఆక్షన్’ (Sleep Auction)లో కంటెస్టెంట్స్ తమకు కావాల్సిన పిల్లోస్, బ్లాంకెట్స్, ఏసీ కంట్రోల్స్, లైటింగ్, సౌండ్ సెట్టింగ్స్ వేలం ద్వారా దక్కించుకోవాల్సి వచ్చింది. హోస్ట్, ఇన్ఫ్లుయెన్సర్ (Influencer) అనుజ్ గుప్తా పాడిన ఒక ర్యాప్ లల్లబీ (Rap Lullaby) ఈ ఆక్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక, ఫైనలిస్టులు తమ చివరి రాత్రిని పోటీ వాతావరణంలో గడిపారు. ఆ రాత్రి వారు సాధించిన స్లీప్ స్కోర్స్ (Sleep Scores) ఆధారంగా విజేతను నిర్ణయించారు. అత్యధిక స్కోరు సాధించిన జినియా ఛటర్జీ తుది విజేతగా నిలిచి రూ.9.6 లక్షల క్యాష్ ప్రైజ్, వెకేషన్ సొంతం చేసుకుంది. 2019లో ప్రారంభమైన ఈ వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్ ఇప్పటివరకు 4 సీజన్లలో 10 లక్షలకు పైగా దరఖాస్తులను రాబట్టింది, అందులో 65 మంది ఇంటర్న్‌లకు రూ.1 లక్ష చొప్పున స్టైపెండ్ (Stipend) అందజేసింది.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
-
Virat Kohli Record: చేసింది ఏడూ పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మార్పు.. ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త సెటిల్మెంట్ రూల్స్..!
-
Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సెన్సేషన్
-
India Head Coach Role: టీమిండియా కోచ్ పదవి అంటే ‘ముళ్ల కిరీటమే’..
ట్రెండింగ్
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!