Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
- రెండో వన్డేలో కేవలం 7 పరుగులకే ఔట్..
- విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు..
- వన్డే క్రికెట్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Record: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో కేవలం 7 పరుగులకే ఔటైనప్పటికీ.. ఓ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ రికార్డును అధిగమించాడు. వెల్లింగ్టన్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 7 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో 7 పరుగులు మాత్రమే చేసి పేసర్ జాకబ్ డఫీ బౌలింగ్‌లో కవర్స్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లోనే ఒక పరుగు చేయడంతో పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు 38 వన్డేలు ఆడిన కోహ్లీ 56.51 సగటుతో 1,978 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2010లో న్యూజిలాండ్‌పై తన తొలి వన్డే ఆడిన కోహ్లీ.. ఇప్పుడు ఆ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. ఆయన న్యూజిలాండ్‌పై 51 వన్డేల్లో 45.83 సగటుతో 1,971 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తొలి వన్డేలో 74 పరుగులు చేసిన కోహ్లీ.. పాంటింగ్ రికార్డును సమం చేయగా, రెండో వన్డేలో ఒక పరుగు సాధించడంతో అతడిని అధిగమించాడు.
Also Read
- Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
- Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సెన్సేషన్
- India Head Coach Role: టీమిండియా కోచ్ పదవి అంటే 'ముళ్ల కిరీటమే'..
- Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
ఇక రెండో వన్డేలో 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ 28 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లీ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయినా.. తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్‌పై అత్యధిక వన్డే పరుగులు చేసిన ఆటగాళ్లు:
1. విరాట్ కోహ్లీ – 1,978 పరుగులు.
2. రికీ పాంటింగ్ – 1,971 పరుగులు.
3. సచిన్ టెండూల్కర్ – 1,750 పరుగులు.
4. కుమార సంగక్కర – 1,568 పరుగులు.
5. సనత్ జయసూర్య – 1,519 పరుగులు.
6. జాక్వెస్ కలిస్ – 1,449 పరుగులు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Panchayat Raj Act : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నిధులపై కొత్త రూల్
-
Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
SEBI New Rules: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ మార్పు.. ఏప్రిల్ 1, 2027 నుంచి కొత్త సెటిల్మెంట్ రూల్స్..!
-
Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సెన్సేషన్
ట్రెండింగ్
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!