Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mitchell Santner: వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందిస్తూ.. టీమిండియా బౌలర్లను మనస్ఫూర్తిగా ప్రశంసించాడు. వెల్లింగ్టన్ పిచ్ బ్యాటింగ్‌కు తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, అలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్లు తమను దారుణంగా దెబ్బకొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బౌలింగ్ వల్లే మ్యాచ్ ఓడినట్లు అర్థం వచ్చేలా మాట్లాడాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ వేడుకలో సాంట్నర్ మాట్లాడుతూ.. “పిచ్ చాలా ట్రిక్కీగా ఉంది, అందులో దాచడానికి ఏమీ లేదు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేసి మాపై ఒత్తిడి పెంచారు. త్వరగా వికెట్లు కోల్పోవడం ఎప్పుడైనా ఇబ్బందే. అయితే మేము చేసిన పరుగులు తక్కువే అయినప్పటికీ, పిచ్‌పై సీమర్లకు సహకారం ఉండటంతో మా బౌలర్లు కూడా బాగానే పోరాడారు. వికెట్లు తీస్తూ భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాం” అని చెప్పుకొచ్చాడు. ఈ క్లిష్టమైన వికెట్‌పై కనీసం 160 నుంచి 180 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని సాంట్నర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ యూనిట్‌గా మరికాస్త ఓపికగా ఆడాల్సిందని అన్నాడు. అలాగే మ్యాచ్ మధ్యలో తమ ఫాస్ట్ బౌలర్ బ్లేర్ టిక్నర్ (Blair Tickner) ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇస్తూ.. అతను ప్రస్తుతం హోటల్ రూమ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడని, త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరగా, వాతావరణం కూడా ఒక కారణమైనప్పటికీ భారత బౌలర్లు పరిస్థితులను చక్కగా వాడుకొని తమను ఆలౌట్ చేశారని సాంట్నర్ ఒప్పుకున్నాడు.
Also Read
- Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం
- Surekha Vani : "వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!": నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
- YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ పర్యటనలో భారత బౌలర్లు తమ విశ్వరూపాన్ని కొనసాగిస్తున్నారు. వరుసగా రెండో వన్డేలోనూ అనుకూలించిన పరిస్థితులను చక్కగా వాడుకుంటూ కీవీస్ బ్యాటర్లను తిప్పలు పెట్టేశారు. శనివారం వెల్లింగ్టన్ (Wellington)లో జరిగిన రెండో ఓడిఐ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించినా, డక్‌వర్త్ లూయిస్ (DLS Method) ప్రకారం భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో ముందంజలో నిలిచింది. వర్షం కారణంగా మొదట.. మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కీవీస్ జట్టు 41 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (Daryl Mitchell) 55 పరుగులతో ఒంటరి పోరాటం చేయగా, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) 31 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో ఎవరూ 11 పరుగులు కూడా దాటలేకపోయారు. భారత బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
ఇండియన్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) 4-30 కెరీర్ బెస్ట్ గణాంకాలతో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇతనికి తోడుగా అకిబ్ నబీ (Auqib Nabi) తన అంతర్జాతీయ కెరీర్లో తొలి రెండు వికెట్లు (2-31) పడగొట్టి ఓపెనర్లు విల్ యంగ్, టిమ్ సైఫర్ట్లను పెవిలియన్‌కు పంపాడు. గుర్నూర్ బ్రార్ తన 20వ ఓవర్లో ఒకేసారి టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్‌లను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఛేజింగ్ అంత సులువుగా సాగలేదు. న్యూజిలాండ్ పేసర్ జాకోబ్ డఫీ (Jacob Duffy) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ను గోల్డెన్ డక్‌గా, విరాట్ కోహ్లీని 7 పరుగులకే ఔట్ చేశాడు. ఆ తర్వాత కైల్ జేమీసన్ 30 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్‌ను పెవిలియన్ చేర్చడంతో భారత్ 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. భారత్ 26 ఓవర్లలో 113-7 తో ఉన్న సమయంలో మళ్లీ వర్షం ప్రారంభమై ఆట నిలిచిపోయింది. ఆ సమయానికి డక్‌వర్త్ లూయిస్ ప్రకార.. భారత్ 4 పరుగులతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (KL Rahul) 26 పరుగులు, అకిబ్ నబీ 1 పరుగుతో క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చారు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Basil Joseph: యాక్టింగ్‌ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!
-
Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి – మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
-
Atulya Chandra : వైద్యుడిపై నటి దాడి కేసులో కళ్లు చెదిరే ట్విస్ట్: బాధితుడు కాదు పచ్చి కామాంధుడు.. ఫోన్లో 12 మంది మహిళల రేప్ వీడియోలు!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!