Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhogi Pre-Release Event Cancelled: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌పై ఊహించని న్యూస్ వైరల్ అవుతోంది. మరికొద్ది సేపట్లో అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన ఈ వేడుక అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా రద్దయింది. రిలీజ్ ముంగిట సర్వం సిద్ధమై, ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్న తరుణంలో చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో శర్వా అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చివరి క్షణంలో ఈవెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో మేకర్స్ ఈవెంట్ క్యాన్సిల్ విషయంపై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది.
ఈ చిత్రంలో శర్వానంద్ మునుపెన్నడూ చూడని అత్యంత పవర్ఫుల్ మాస్ రోల్లో కనిపించబోతున్నారు. 1960ల నాటి ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక ఊరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ పీరియడ్ కథ నడుస్తుంది. ఇందులో శర్వానంద్ ‘గంగా’ అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించి తన నటనతో థియేటర్లలో పూనకాలు తెప్పించనున్నారు. పీరియడ్ సెటప్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, అణచివేతకు వ్యతిరేకంగా సాగే కథ ఈ సినిమాకు ప్రధాన బలం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ఏమాత్రం రాజీ పడకుండా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మాస్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఇప్పటికే సినిమాపై హైప్ పెంచేశాయి. వాస్తవానికి ఈ సినిమాను ఆగస్టు 28నే విడుదల చేయాలనుకున్నప్పటికీ, 1960ల నాటి వాతావరణాన్ని సహజంగా చూపించేందుకు అవసరమైన భారీ వీఎఫ్ఎక్స్ పనుల కోసం ఆలస్యమైంది. క్వాలిటీ విషయంలో వెనక్కి తగ్గకుండా పనులన్నీ పూర్తి చేసుకుని, ఫైనల్‌గా నవంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు ‘భోగి’ సిద్ధమైంది. తాజా ఈవెంట్ రద్దు కావడం ఫ్యాన్స్‌ను కాస్త నిరాశపరిచినా, వెండితెరపై శర్వానంద్ విధ్వంసం చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Basil Joseph: యాక్టింగ్‌ను పక్కనపెట్టి దర్శకుడిగా మారిన హీరో.. బన్నీ కోసమేనా!
- Atulya Chandra : వైద్యుడిపై నటి దాడి కేసులో కళ్లు చెదిరే ట్విస్ట్: బాధితుడు కాదు పచ్చి కామాంధుడు.. ఫోన్లో 12 మంది మహిళల రేప్ వీడియోలు!
- Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
- Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
-
North Korea Cyber Army: ప్రపంచాన్ని భయపెడుతున్న కిమ్ ‘సైబర్ సైన్యం’.. తెరవెనుక షాకింగ్ నిజాలు ఇవే!
-
Telangana Eagle Force : తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా… లేడీ డాన్ నీతూ బాయి అరెస్ట్!
-
Mitchell Santner: “వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు”.. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!