Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Pacers Dominance: భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరుసగా రెండు వన్డేల్లోనూ కివీస్ జట్టును 200 పరుగులలోపే ఆలౌట్ చేశారు. దీంతో న్యూజిలాండ్ 25 ఏళ్ల నాటి చెత్త రికార్డును సమం చేసింది. భారత బౌలర్లు ప్రయోగిస్తున్న షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేక కివీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట చేరుతున్నారు.
నవంబర్ 4న జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక నేడు వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో వన్డేలోనూ కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఒక వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 200 పరుగులలోపే ఆలౌట్ కావడం న్యూజిలాండ్‌కు 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారిగా 2001లో శ్రీలంకపై కివీస్ జట్టు ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పుడు భారత బౌలర్లు అదే పరిస్థితిని పునరావృతం చేశారు. న్యూజిలాండ్ బ్యాటర్ల పతనం వెనుక భారత బౌలర్లు అనుసరిస్తున్న ప్రత్యేక వ్యూహం ఉంది. వేగంగా దూసుకొచ్చే షార్ట్ పిచ్ బంతులు, బౌన్సర్లతో కివీస్ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఈ రెండు వన్డేల్లో పడిన 20 వికెట్లలో ఏకంగా 9 వికెట్లు షార్ట్ పిచ్ బంతులకే పడ్డాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Also Read
- Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
- Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
- Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
- Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సెన్సేషన్
ఈ తొమ్మిది వికెట్లలో ఐదు వికెట్లు గుర్నూర్ బ్రార్ ఖాతాలోనే చేరాయి. అతడి రాకతో భారత పేస్ బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూరింది. వేగంతో పాటు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తూ న్యూజిలాండ్ పరిస్థితులకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత బౌలర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. గుర్నూర్ బ్రార్ 7 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ చెరో 4 వికెట్లు తీశారు. మిగిలిన వికెట్లు ఇతర బౌలర్లకు, రనౌట్ల రూపంలో దక్కాయి. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్, అన్షుల్ కాంబోజ్ తమ పేస్‌తో కివీస్ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెడుతున్నారు. షార్ట్ పిచ్ బంతులు, బౌన్సర్లను సమర్థంగా ఉపయోగిస్తూ భారత పేసర్లు న్యూజిలాండ్ గడ్డపై సత్తా చాటుతున్నారు. ఇదే వ్యూహాన్ని కొనసాగిస్తే మిగిలిన మ్యాచ్‌ల్లోనూ కివీస్ బ్యాటర్లకు కష్టాలు తప్పేలా లేవు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Telangana Student Missing: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. బోస్టన్‌లో తీవ్ర కలకలం
-
Hyderabad: భర్తలు తేవడం.. భార్యలు అమ్మడం.. ఆల్వాల్‌లో డిఫెన్స్ మద్యం దందా!
-
Ex-Girlfriend Case: మాజీ ప్రేయసి వివరాల కోసం యువకుడి ప్రయత్నం.. 97 RTI దరఖాస్తులు, 1,887 ప్రశ్నలు! షాకైన కమిషన్
-
Panchayat Raj Act : పంచాయతీలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. నిధులపై కొత్త రూల్
ట్రెండింగ్
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..