బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని.. తీరా ఫలితాల సమయానికి అంతా తారుమారు చేశారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లో మాత్రమే కాంగ్రెస్‌కు ఎడ్జ్ కనిపించిందని.. ఈవీఎంల లెక్కింపు సమయంలో ఫలితాలు తారుమారైపోయాయని చెప్పారు. హర్యానాలో 2 కోట్ల ఓటర్లు ఉంటే.. 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని తెలిపారు. కేవలం 22 వేల ఓట్ల తేడాతో హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఒక బీజేపీ నేత కుమారుడు రెండు రాష్ట్రాల్లో ఓటు వేశారన్నారు. ఎన్నికల సంఘం ఈవీఎంలను ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. హర్యానాలో 5 రకాలుగా ఓట్ల చోరీ జరిగిందని వివరించారు.
‘‘బ్రెజిల్ మోడల్ మాథ్యూస్ ఫెరిరో ఫొటోతో 10 పోలింగ్ బూత్‌ల్లో 22 ఓట్లు ఉన్నాయి. ఒకే ఫొటోతో 253 ఓట్లు రెండు పోలింగ్ బూత్‌ల్లో ఉన్నాయి. ఇలాంటి ఫేక్ ఓట్లు వేల సంఖ్యలో ఉన్నాయి. 1,24,177 ఫేక్ ఓట్లు ఉన్నాయి. ఈ అక్రమాలు బయటపడవద్దని ఎన్నికల సంఘం సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసం చేసింది . సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఇవ్వడంలేదు. డూప్లికేట్ ఓట్లను తొలగించే సాఫ్ట్వేర్ ఈసీ దగ్గర ఉంది. కానీ ఎందుకు డూప్లికేట్ ఓట్లు తొలగించడం లేదు. బీజేపీయే డూప్లికేట్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్పిస్తుంది. యూపీ, హర్యానాలో వేల సంఖ్యలో డూప్లికేట్ ఓటర్లు ఉన్నారు. యూపీ, హర్యానాలో బీజేపీ నాయకులకు ఓట్లు రెండు చోట్ల ఓట్లున్నాయి. హర్యానాలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడున్నర లక్షల ఓట్లను తొలగించారు.’’ అని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Zohran Mamdani: జవహర్లాల్ నెహ్రూను గుర్తుచేసుకుంటూ మమ్దానీ తొలి ప్రసంగం
రేపే బీహార్‌లో తొలి విడత పోలింగ్ జరగనుంది. గురువారం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో మొదటి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల సిబ్బంది కూడా ఆయా బూత్‌లకు తరలివెళ్తున్నారు. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇక తొలి దశలో 1,314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. నలుగురు మృతి
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ గురువారం (06-11-2025) 121 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రెండో దశ 11-11-2025న జరగనుంది. రెండో విడతలో 122 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
LIVE: #VoteChori Press Conference – The H Files https://t.co/IXFaH9fEfr
— Rahul Gandhi (@RahulGandhi) November 5, 2025