సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆయా దేశాలకు గడువు ముంచుకొస్తోంది. యూకే, వియత్నాం, చైనా తప్ప.. ఇంకా ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. భారత్‌తో కీలక డీల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. వ్యవసాయం, పాడి శ్రమకు సంబంధించిన డీల్ పెట్టుకుంటే ముప్పు వాటిల్లుతుందేమోనని భారత్ భయపడుతోంది. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మాత్రం భారీగా సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య గందరగోళం నెలకొంది.
ఇది కూడా చదవండి: Dhoolpet: దేవుడి చిత్రపటాల వెనుక గంజాయి పెట్టి.. పూజలు చేస్తున్నట్టు డ్రామా.. పోలీసుల ఎంట్రీతో
తాజాగా ఇదే అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ.. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోడీ తలవంచాల్సిందేనని.. ఇది గ్యారంటీ అని.. తన మాటల మీద నమ్మకం లేకపోతే రాసిపెట్టుకోవాలని రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు.
ఇది కూడా చదవండి: Lopaliki Ra Chepta : లోపలికి రా చెప్తా రివ్యూ..
ఇక శుక్రవారం కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారతదేశం పటిష్ట విధానాలను కలిగి ఉంటుందని.. ఎప్పుడూ తొందరపడదని చెప్పారు. గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. ఇరు వర్గాలకు లాభదాయకంగా ఉంటేనే ఒప్పందాలు అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. అయితే ట్రంప్ విధించిన గడువు మరికొన్ని గంటల్లోనే ముగుస్తుంది. ఆలోపే చర్చలు ముగిస్తామని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. అయితే పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ తాజాగా స్పందిస్తూ.. ట్రంప్ సుంకాలకు మోడీ సర్కార్ తలొగ్గాల్సిందేనని వ్యాఖ్యానించారు. అవసరమైతే రాసిపెట్టుకోవాలని సూచించారు.
భారతదేశానికి వ్యవసాయం, పాడి పరిశ్రమ అనేది చాలా సెంటిమెంట్. అలాంటిది వాటిపైనే అమెరికా సడలింపు కోరుతోంది. ఒకవేళ భారత్ తలొగ్గితే.. అన్నదాతలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే భారత్ తర్జనభర్జన పడుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఎటూ తేల్చుకోలేకపోతుంది. వాస్తవానికి ఇరుదేశాల అధికారుల చర్చలైతే ముగిశాయి. చివరిగా ట్రంప్-మోడీ మాట్లాడుకునే దానిని బట్టే ఒప్పందాలు ఫైనల్ అవుతాయి. చివరికి ఏమవుతుందో చూడాలి.