కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘లోపలికి రా చెప్తా’. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హీరోగా నటిస్తోన్న వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించారు. టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం పదండి.
కథ : రామ్ హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్. నగర వీధుల్లో తిరుగుతూ ఉల్లాసమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ రోజు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అందమైన అమ్మాయి రుక్మిణి నంబర్ ఇస్తుంది. తన ఇంటికి రమ్మని చెప్తే వెళ్తాడు. ఎంట్రీ బుక్ లో విల్లా నెంబర్ మార్చి రాస్తాడు. కానీ ఆ సంఘటన తర్వాత రామ్ జీవితంలో అనుకొనే సంఘటనలు ఎదురవుతాయి. కొన్నాళ్ళకు రామ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కానీ శోభనం రోజున రామ్ భార్యలో దెయ్యం ఆవహిస్తుంది. అసలు ఆ దెయ్యం ఎవరు, ఆ దెయ్యంకు రామ్‌కు ఏం సంబంధం? దెయ్యం బారి నుంచి రామ్ తన భార్యని ఎలా కాపాడుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : కథగా చుస్తే ఇదొక చిన్న కథ. కానీ దాన్ని దర్శకుడు కమ్ హీరో రాజేంద్ర ఫన్ జోనర్ లో మలిచి నవ్వులు పూయించాడు. ముఖ్యంగా యూత్ కావాల్సిన రొమంటిక్ ఎలిమెంట్స్ తో కామెడీని జోడించి నవ్వించాడు. తన సినిమా ఆడియెన్స్ ను ఎవరి అనేది దర్శకుడు వెంకట రాజేంద్రకు చాలా క్లారిటీ ఉంది. అందుకు తగ్గట్టే సినిమాను మలిచాడు. ఫస్టాఫ్ ను గంట పదినిముషాలు, సెకండ్ హాఫ్ ను నలభై నిమిషాలతో పర్ఫెక్ట్ గా ముగించాడు. సెకండ్ ఆఫ్ లో వచ్చే ని సూదిలో నా దారం సాంగ్ సీరియస్ గా కథలో నవ్వులు పూయించి మెప్పించింది.
నటీనటులు పర్ఫామెన్స్ : హీరో కమ్ దర్శకుడు కొండా వెంకట రాజేంద్ర అన్ని తానై ఈ సినిమాను మోశాడు. తనదైన నటనతో అలరించాడు. యాక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే హీరోయిన్ సుష్మిత అనాలా అద్భుతమైన పర్ఫెమెన్స్ ఇచ్చింది. మనీషా జిష్ణని పర్వాలేదు.శుభం సినిమాలో డిష్ రాజుగా చేసిన వంశి ఈ సినిమాలో బ్లాక్ స్పారో పాత్రలో చాలా బాగా చేసారు. ఇక ఎడిటింగ్ కూడా షార్పగా ఉంది. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈగల్ సినిమా ఫేమ్ డేవ్ మ్యూజిక్, నేపధ్య సంగీతం బాగుంది. కెమెరా రేవంత్, అరవింద్ లొకేషన్స్ ను బాగా చూపించారు.
ఓవరాల్ : లోపలికి వెళ్లిన వారికి నవ్వులు గ్యారింటి