మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు క్రికెటర్ జాస్ ఇందర్ సింగ్ నుంచి రూ. 2 కోట్లు డిమాండ్ చేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు.
వృత్తిపరమైన శిక్షణ కోసం స్కూల్ ప్రిన్సిపాల్స్‌ను సింగపూర్ పంపించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం 36 మంది ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సింగపూర్ పర్యటనను జెండా ఊపి ప్రారంభించారు.
పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు.. చాలా సార్లు బహిర్గతం అయ్యాయి.. మాజీ సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ మధ్య వివాదాల నేపథ్యంలో.. చివరకు అమరీందర్ సింగ్ సీఎం పదవి పోయింది.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. అయితే, ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. అప్పటి పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఫతేఘర్ సాహిబ్‌లో పర్యటించిన ఆయన…