Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Puja Khedkar Anticipatory Bail Plea Rejected After Upsc Selection Cancelled

Puja khedkar: పూజా ఖేద్కర్‌కు మరోసారి చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

Published Date :August 1, 2024 , 5:22 pm
By Suresh Maddala
  • పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
Puja khedkar: పూజా ఖేద్కర్‌కు మరోసారి చుక్కెదురు.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
  • Follow Us :
  • google news
  • dailyhunt

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తప్పుడు పత్రాలు సమర్పించి యూపీఎస్సీ ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై ఢిల్లీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టులో పూజా పిటిషన్ వేసింది. గురువారం విచారించిన ధర్మాసనం.. ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఏదో సమయంలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Iran warns Israel: హమస్ చీఫ్ హనియే హత్యకు తప్పకుండా ప్రతీకారం ఉంటుంది.. ఇజ్రాయిల్‌కి వార్నింగ్..

పూజా ఖేద్కర్‌ (34)కు యూపీఎస్సీ బుధవారం భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ తర్వాత యూపీఎస్పీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆమె భవిష్యత్ అంధకారమైంది.

ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ ఎంపిక రద్దు చేస్తూ బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఆమె పరీక్షకు హాజరైన ప్రతిసారి నకిలీ పత్రాలు సృష్టించి హాజరైనట్లుగా గుర్తించింది. ఆమె పేరుతో పాటు.. తల్లిదండ్రుల పేర్లు కూడా పలుమార్లు మార్చేసినట్లుగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లో కూడా ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. జూలై 30 వరకు సమయం ఇచ్చింది. గడువులోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. కానీ ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది.

2023 బ్యాచ్‌కు చెందిన పూజా.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఆలిండియా వైడ్‌గా 841 ర్యాంక్ సంపాదించింది. దీంతో ట్రైనీ ఐఏఎస్‌గా.. సొంత ప్రాంతమైన పూణెలోనే పోస్టింగ్ పడింది. ఆనందంగా రెండేళ్ల పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకోవల్సిన ఆమె.. హద్దులు దాటింది. ఉన్నతమైన పోస్టుకు ఎంపికైనా.. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం.. ఆమెకు రుచించలేదు. అంతే పూణె కలెక్టరేట్‌లో సకల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి హుకుం జారీ చేసింది. అంతేకాకుండా సెలవుపై వెళ్లిన అదనపు కలెక్టర్.. కార్యాలయాన్ని ఆక్రమించుకుని.. తన నేమ్ ఫ్లేట్.. తన వస్తువుల్ని తెచ్చుపెట్టుకుంది. ఆడికారు.. దానిపై ఎర్ర లైటు.. కారుపై మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసిపెట్టుకుని నానా హడావుడి చేసింది. పూజా చర్యలపై విసుగెత్తిన.. పూణె కలెక్టర్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను వాషిమ్‌కు బదిలీ చేశారు.

ఈ వ్యవహారం ఇంతటితో ఆగలేదు. ఆమె నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. చదువు దగ్గర నుంచి క్యాష్ట్, రేషన్ కార్డు.. ఇలా అన్ని సర్టిఫికెట్లు నకిలీ సృష్టించి ఉద్యోగాన్ని సంపాదించినట్లుగా ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆమె శిక్షణ కాలాన్ని యూపీఎస్సీ నిలిపివేసింది. అంతేకాకుండా ఈనెల 30లోగా వివరణ ఇవ్వాలని తెలిపింది. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బుధవారం పూజాపై కఠిన చర్యలు తీసుకుంది. ఆమె అభ్యర్థిత్వంతో పాటు భవిష్యత్‌‌లో పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: 7 నెలల నిండు గర్భంతో ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ.. తప్పుబడుతున్న ఈజిప్టు దేశస్థులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anticipatory bail plea rejected
  • ias
  • Puja Khedkar
  • Pune
  • Selection cancelled

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions