Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు
- యోగి కేబినెట్ ఆమోదం
- యూపీ ఎన్నికల వేళ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని జేవర్లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు పెట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ కేబినెట్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇకపై ఈ విమానాశ్రయాన్ని ‘నరేంద్ర మోడీ అంతర్జాతీయ విమానాశ్రయం’ గా పిలవాలని ప్రతిపాదించారు.
లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం యోగి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం భవిష్యత్తులో దేశంలోనే అతిపెద్ద విమానయాన కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
- Naseeruddin Shah: 'నేను దిమాగీ నక్సల్‌నే'.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
జేవర్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్‌లోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిలవనుంది. జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది సేవలందించనుంది. విమానాశ్రయాన్ని 2026 మార్చిలో ప్రారంభించగా.. జూన్ 15న లక్నో నుంచి వచ్చిన ఇండిగో విమానం ఇక్కడ తొలి ల్యాండింగ్ చేసింది.
ఈ విమానాశ్రయాన్ని ఆధునిక రవాణా కేంద్రంగా అభివృద్ధి చేశారు. విమాన ప్రయాణంతో పాటు రోడ్డు మార్గాలు, ఇతర రవాణా వ్యవస్థలను అనుసంధానించేలా దీనిని రూపొందించారు. ప్రయాణికులకు ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించడంతో పాటు, ప్రయాణికులు, విమానాశ్రయ మౌలిక సదుపాయాల భద్రత కోసం ఆధునిక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. జేవర్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న రన్‌వేకు రెండు చివర్లలోనూ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS) ఏర్పాటు చేశారు. వాతావరణ పరిస్థితులు, గాలి దిశను బట్టి విమానాలు రన్‌వేకు ఇరువైపుల నుంచి ల్యాండింగ్ అయ్యేందుకు ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీంతో విమానాల రాకపోకలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు వీలవుతుంది.
మీడియా సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన పలు అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు. ఒక ఆలయంలో ధార్మిక పతాకాన్ని ఎగురవేయడం, కాశీ విశ్వనాథ ఆలయ విస్తరణ, గంగా పథ్ ద్వారా ఆలయానికి ప్రత్యక్ష అనుసంధానం వంటి కార్యక్రమాలను వివరించారు. బౌద్ధ ప్రాంతంలో పిపర్వా పునరుద్ధరణ, ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాను భారీ స్థాయిలో నిర్వహించడం, బౌద్ధ సర్క్యూట్ అభివృద్ధి, కాశీ తమిళ సంగమం వంటి కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇవే కాకుండా సంత్ గురు రవిదాస్ మ్యూజియం, విగ్రహం ఏర్పాటు, గోరఖ్‌పూర్‌లో అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రేరణా స్థల్ అభివృద్ధి, మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రదానం వంటి అంశాలను కూడా యోగి గుర్తుచేశారు.
జేవర్ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఉత్తరప్రదేశ్‌తో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలో విమాన ప్రయాణాల సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా, అనుబంధ వ్యాపారాలకు ఇది కీలక కేంద్రంగా మారుతుందని భావిస్తున్నారు. విమానాశ్రయానికి నరేంద్ర మోడీ పేరు పెట్టే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం లభించడంతో.. ఈ నిర్ణయంపై తదుపరి అధికారిక ప్రక్రియ ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
#WATCH | Lucknow: UP CM Yogi Adityanath says, “…The Uttar Pradesh Council of Ministers is grateful to the Prime Minister for gifting the state the Noida International Airport (Jewar); this is set to become Uttar Pradesh’s largest airport and, in the future, the country’s largest aviation hub. Consequently, the Council of Ministers has also passed a proposal to rename the Noida International Airport as the ‘Narendra Modi International Airport, Noida-Jewar’…”
— ANI (@ANI) October 9, 2026
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?