వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.