ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఫరూఖాబాద్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రైవేట్ విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఇందులో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ సీన్ చూస్తే.. విమాన ప్రయాణమంటేనే హడలెత్తిపోతారు. ఈ మధ్య విమాన ప్రమాదాలు విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయినా విమాన సంస్థలు అప్రమత్తం కావడం లేదు. తాజాగా జరిగిన ఈ ఘటన మరింత భయాందోళన కల్గిస్తోంది.