PM Modi: 18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్రమోడీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. శుక్రవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పార్టీలన్నీ మోడీని ఎన్డీయే పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నాయి. ప్రధానిగా మోడీకి అంతా సమ్మతి తెలిపారు. దీంతో ఈ రోజు(శుక్రవారం) ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న మోడీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘‘ దహీ-చీనీ( తీపి పెరుగు)’’ తినిపించారు.
Read Also: Boyapati: బాబు ప్రమాణస్వీకార బాధ్యతలు బోయపాటి చేతికి.. సినిమా వేడుకలను తలదన్నేలా!
బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్రపతి మోడీని ఆహ్వానించారు.జూన్ 9(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ.. తనను ప్రధానమంత్రిగా నియమించాలని అధ్యక్షుడు ముర్ము లేఖ ఇచ్చారని, ప్రమాణ స్వీకారోత్సవానికి తగిన సమయం వివరాలను కోరారని చెప్పారు. తనతో ప్రమాణం చేసే మంత్రుల జాబితాను కూడా ఆమె కోరినట్లు తెలిపారు.