Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
- ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’
- బీజేపీపై మండిపడడ్డ ప్రశాంత్ కిషోర్
- బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల కదనరంగంలోకి దిగారు. ఈనెల 30న జరగనున్న బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీకి దిగారు. ఆదివారమే తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ ఉపఎన్నిక ప్రస్తుతం రసవత్తరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగారు.
సోమవారం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంకీపూర్ ఉపఎన్నికలో తన పోటీని తేలికగా తీసుకుంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ప్రజల పట్ల అహంకారాన్ని చూపిస్తున్నాయని అన్నారు. బీజేపీకి ఈ అహంకారానికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ‘‘నేను బాంకీపూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత బీజేపీ నాయకులను ఇది ఎంత పెద్ద సవాలో అని అడిగితే.. బంకీపూర్ తమకు అంత బలమైన కోట అని, అక్కడ కుక్కను లేదా పిల్లిని అభ్యర్థిగా నిలబెట్టినా ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారని అన్నారు. ఇది ఆత్మవిశ్వాసం కాదు.. ప్రజల పట్ల అహంకారం’’ అని విమర్శించారు. అంతేకాకుండా బీహార్‌లోని చైతన్యవంతులు, చదువుకున్న, అభివృద్ధి కోరుకునే ఓటర్ల గురించి బీజేపీ ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంటే.. సాధారణ ప్రజల గురించి వారు ఎలా ఆలోచిస్తున్నారో ఊహించవచ్చన్నారు. ‘‘ఈ అహంకారానికి వ్యతిరేకంగానే ప్రజలు ఓటు వేస్తారు’’ అని స్పష్టం చేశారు.
Also Read
- Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఆదివారం అధికారికంగా పోటీ ప్రకటించారు. ఈ స్థానం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఖాళీ అయింది. 2006 నుంచి బంకీపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నితిన్ నబిన్ ఏప్రిల్‌లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి జూలై 30న ఉపఎన్నిక జరగనుంది. బంకీపూర్‌ను బీజేపీకి సంప్రదాయ బలమైన నియోజకవర్గంగా భావిస్తారు.
ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక కేవలం ఎమ్మెల్యేను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదని, బీహార్‌లో కొత్త రాజకీయ వ్యవస్థకు నాంది పలికే ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) అని పేర్కొన్నారు. ‘‘ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా కూల్చివేయడం కోసం జరిగే ఎన్నిక కాదు. బీహార్‌లో కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టే అవకాశం. రాష్ట్రంలోని చైతన్యవంతమైన ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుని కొత్త రాజకీయాలకు దారి చూపుతారని నమ్ముతున్నాను’’ అని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ నుంచి పోటీ చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ నియోజకవర్గంలో బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించిన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల్లో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. జన్ సురాజ్ పార్టీకి సుమారు 3.34 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు బంకీపూర్ ఉపఎన్నిక ద్వారా ఆయన తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!