US Report: అమెరికా మానవహక్కుల నివేదికపై భారత్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Report: దేశంలో మానవహక్కుల పరిస్థితులపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది మణిపూర్ హింస చెలరేగిన తర్వాత ఆ రాష్ట్రంలో గణనీయమైన మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయని నివేదిక పేర్కొంది. అయితే, దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఇది తీవ్ర పక్షపాతంతో కూడుకున్నదని, భారత్‌పై సరైన అవగాహన లేదనే విషయాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొంది. గురువారం విదేశాంగ మంత్రిత్వశాఖ వారపత్రిక మీడియా సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు.. అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, “ఈ నివేదిక తీవ్ర పక్షపాతంతో కూడుకున్నది మరియు భారతదేశంపై చాలా తక్కువ అవగాహనను ప్రతిబింబిస్తుంది. మేము దీనికి ఎటువంటి విలువ ఇవ్వము మరియు మీరు కూడా అలాగే పరిగణించండి” అని ఆయన అన్నారు.
ఇటీవల విడుదలైన ‘2023 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ ప్రాక్టీసెస్: ఇండియా’ నివేదికలో అమెరికా ఈ ఆరోపణల్ని చేసింది. మణిపూర్‌లోని మెయిటీ, కుకీ కమ్యూటీల మధ్య జాతి వివాదం ‘‘మానవహక్కుల ఉల్లంఘనకు’ దారి తీసిందని పేర్కొంది. ఈ ఘటనను ప్రధాని నరేంద్రమోడీ సిగ్గుచేటని అభివర్ణించి, చర్యలు తీసుకోవాలని కోరినట్లు కూడా నివేదిక పేర్కొంది.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
Read Also: Mumbai: కారులో ఆడుకుంటుండగా లాక్.. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి
ఇదే కాకుండా ఈ నివేదికలో జమ్మూ కాశ్మీర్లో పలువురు జర్నలిస్టులు, మానవహక్కుల నేతలను విచారించారనే పలు రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. గతంలో పలుమార్లు దేశంలో మానవహక్కులు తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని అమెరికా రిపోర్టులు ఇచ్చింది. ప్రతీసారి కూడా భారత్ దీనిని తీవ్రంగా తప్పుబడుతూనే ఉంది.
గతేడాది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణ తలెత్తింది. మెజారిటీ మైయిటీ, కుకీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలని మైయిటీ వర్గం కోరడాన్ని కుకీలు వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో పలువురు మరణించారు. చాలా మంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలివేరే ప్రాంతాలకు వెళ్లారు. అయితే, ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!