DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- వివాదంలో సీఎం డీకే శివకుమార్..
- సగం తిన్న ఆపిల్‌ను కార్యకర్తలపైకి విసిరిన డీకే..
- ఇది అహంకారం అంటూ బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shiva Kumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గం కనకపురలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ సమావేశంలో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం కనకపురలో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గౌరవార్థం భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రేన్ సాయంతో ఆపిల్ పండ్లతో చేసిన భారీ దండను ఆయనకు బహూకరించారు. సన్మాన కార్యక్రమం తర్వాత శివకుమార్ రెండు ఆపిల్ పండ్లను కొరికి తిన, వాటిని ఒక్కొక్కటిగా అక్కడున్న పార్టీ కార్యకర్తలపైకి విసిరారు. అయితే, వీటిని మహా ప్రసాదంగా భావించిన కాంగ్రెస్ కార్యకర్తలు విసిరేసిన ఆపిల్ ముక్కల కోసం ఎగబడ్డారు.
ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసి, అధికారంలో కోసం ఓటు వేసే ప్రజలపైనే సగం తిన్న ఆపిల్ విసరడం తమాషా కాదని, ఇది కాంగ్రెస్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని బీజేపీ పేర్కొంది. ‘‘గౌరవం అనేది కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కూడా వ్యక్తమవుతుందని ,ప్రజలు గౌరవాన్ని ఆశిస్తారు కానీ దానాన్ని కాదు. గౌరవం స్థానంలో అహంకారం చోటుచేసుకున్నప్పుడు, ప్రజలు ప్రతిస్పందిస్తారు’’ అని బీజేపీ ఫైర్ అయింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!