Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Homemade Ayurvedic Bath Powder: ప్రస్తుతం చాలా మంది రోజువారీ స్నానానికి సబ్బులు, బాడీ వాష్‌లు ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో ఉండే రసాయనాలు చర్మాన్ని పొడిబార్చడంతో పాటు సహజ కాంతిని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ, దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మం నల్లబడటం, కాంతి కోల్పోవడం వంటి సమస్యలు మరింత పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసుకునే ఆయుర్వేద స్నానపు పౌడర్ చర్మ సంరక్షణకు మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఆయుర్వేదంలో చర్మాన్ని లోతుగా శుభ్రపరిచే, సహజ కాంతిని పెంచే అనేక మూలికలు ఉన్నాయి. వాటిలో అంబా పసుపు, గులాబీ రేకులు, మంజిష్ఠ, వేప ఆకులు, అర్జున బెరడు వంటి పదార్థాలు ప్రముఖమైనవి. ఈ ఐదు సహజ పదార్థాలతో తయారుచేసే స్నానపు పొడి చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా మృత కణాలను తొలగించి, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
కావలసిన పదార్థాలు
* అంబా పసుపు
* గులాబీ రేకులు
* మంజిష్ఠ
* వేప ఆకులు
* అర్జున బెరడు
Also Read
- Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
- Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
- Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
- Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ 'ఆలూ సమోసా'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
తయారీ విధానం
ముందుగా అన్ని పదార్థాలను సమాన పరిమాణంలో తీసుకుని మిక్సర్ జార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. అనంతరం ఆ పొడిని ఒక గిన్నెలో బాగా కలిపి గాలి చొరబడని గాజు సీసా లేదా డబ్బాలో నిల్వ చేయాలి. ఈ విధంగా నిల్వ చేసిన పొడి నెలల తరబడి ఉపయోగించుకోవచ్చు.
ఉపయోగించే విధానం
స్నానం చేసే సమయంలో ఒకటి నుంచి రెండు టీస్పూన్ల పొడిని తీసుకుని కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను శరీరమంతా అప్లై చేసి చేతులతో మృదువుగా రుద్దాలి. అనంతరం శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల చర్మం సహజంగా శుభ్రపడటంతో పాటు కాంతివంతంగా మారుతుంది.
ఈ స్నానపు పొడి వల్ల కలిగే ప్రయోజనాలు
* ఈ సహజ క్లెన్సర్ చర్మంలోని సహజ నూనెలను తొలగించకుండా మృత చర్మ కణాలను తొలగిస్తుంది.
* రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* టానింగ్, మచ్చలు, నిర్జీవంగా కనిపించే చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
* అంబా పసుపు చర్మ ఛాయను మెరుగుపరచి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
* గులాబీ రేకులు చర్మానికి సహజ తేమను అందించి సువాసనను ఇస్తాయి.
* మంజిష్ఠ చర్మ శుద్ధికి ఉపయోగపడుతూ నల్లబడటాన్ని తగ్గిస్తుంది.
* అర్జున బెరడు చర్మాన్ని బిగుతుగా ఉంచి ముడతలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
* వేప ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
సబ్బులు, బాడీ వాష్‌లకు బదులుగా ఈ ఆయుర్వేద స్నానపు పొడిని ఉపయోగించడం ద్వారా రసాయనాల ప్రభావం లేకుండా సహజమైన చర్మ సంరక్షణ పొందవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారుచేసుకునే ఈ చిట్కా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!