Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driving License: దేశవ్యాప్తంగా కోట్లాది మంది వాహనదారులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ (DL) కాలపరిమితిని ఏకంగా 50 ఏళ్లకు పెంచే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదే గనుక జరిగితే, జనాలకు లైసెన్స్ రెన్యూవల్ కోసం పదే పదే ఆర్టీవో (RTO) ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని అంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే అది గరిష్టంగా 20 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత గడువు ముగియగానే మెడికల్ సర్టిఫికెట్, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించి మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కాలపరిమితిని 50 ఏళ్లకు పెంచాలని కేంద్ర రవాణా శాఖ భావిస్తోందట. దీనివల్ల పౌరులపై అదనపు భారం తగ్గడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
ట్విస్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ సరికొత్త ప్రతిపాదనపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీని ఒకేసారి 50 ఏళ్లకు పెంచితే, రెన్యూవల్ ఫీజుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుందని కొన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ఆదాయ లోటును ఎలా పూడ్చాలనే అంశంపై ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర రవాణా శాఖల మధ్య చర్చలు నడుస్తున్నాయని సమాచారం. కేవలం డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా, వాహనదారులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు రహదారి మంత్రిత్వ శాఖ మరికొన్ని కీలక మార్పులను కూడా సిద్ధం చేస్తోందని చెబుతున్నారు. ఇకపై వాహన యాజమాన్య హక్కుల (Vehicle Ownership) బదిలీ ప్రక్రియను కూడా పూర్తిగా ఆన్లైన్ చేయనున్నారు. కమర్షియల్ వాహనాల పర్మిట్ రెన్యూవల్ ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేయాలని చూస్తున్నారట. దీనివల్ల పేపర్ వర్క్ పూర్తిగా తగ్గడమే కాకుండా, చిన్న చిన్న పనుల కోసం పౌరులు ఆర్టీవో కార్యాలయాలకు తరచూ వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలన్నీ పరిశీలన దశలోనే ఉన్నాయి. దీనిపై ఉన్నత స్థాయి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, త్వరలోనే అన్ని రాష్ట్రాల రవాణా మంత్రులతో సమావేశం నిర్వహించి దీనిపై ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని రవాణా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!