SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIPRI 2026: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అణ్వాయుధాల మోహరింపుపై స్వీడన్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ థింక్ ట్యాంక్ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (SIPRI) సంచలన నివేదికను రిలీజ్ చేసింది. సోమవారం రిలీజ్ చేసిన ‘సిప్రి ఇయర్‌బుక్ 2026’ ప్రకారం.. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా శాంతికాలంలో (Peacetime) ఏకంగా 12 అణ్వాయుధాలను పూర్తిస్థాయిలో మోహరించింది. మరోవైపు పొరుగు దేశం చైనా సైతం భారత్, అమెరికా సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని తన అణు మోహరింపును భారీగా పెంచడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
డ్రాగన్ దూకుడు.. భారత్ ముందస్తు మేల్కొలుపు
సిప్రి నివేదిక ప్రకారం.. చైనా తన అణ్వాయుధాల మోహరింపును వేగంగా పెంచుతోంది. 2025లో చైనా వద్ద మోహరించిన అణ్వాయుధాల సంఖ్య 24 ఉండగా.. 2026 జనవరి నాటికి ఆ సంఖ్యను 34కు పెంచింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే 10 కొత్త అణు వార్హెడ్లను రెడీ చేసింది. ఇదే సమయంలో చైనా దూకుడుకు బ్రేక్ వేసే వ్యూహంలో భాగంగా, భారతదేశం కూడా ఇప్పుడు క్షిపణులపై తక్కువ సంఖ్యలో అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచుతోందని సిప్రి అంచనా వేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం భారత్ వద్ద 12 మోహరించిన అణ్వాయుధాలు ఉన్నాయి. శాంతికాలంలో భారత్ ఇంత పెద్ద ఎత్తున అణ్వాయుధాలు మోహరించడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
అగ్రస్థానంలో రష్యా..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్షిపణులు, యుద్ధ విమానాలతో పాటు దాదాపు 4,012 అణ్వాయుధాలు మోహరింపు దశలో సిద్ధంగా ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. బాలిస్టిక్ క్షిపణులపై అమర్చిన 2,100 నుంచి 2,200 వరకు వార్హెడ్లు “అత్యంత అప్రమత్తత” (High-Operational Alert) స్థితిలో ఉంచబడ్డాయి. వీటిలో దాదాపు అన్ని అణ్వాయుధాలు రష్యా, అమెరికాలకు చెందినవే కాగా, స్వల్ప సంఖ్యలో ఫ్రాన్స్, బ్రిటన్ వద్ద ఉన్నాయి.
ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన ఆ 9 దేశాలు ఇవే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12,187 అణు వార్హెడ్లు ఉన్నాయి. అందులో 9,745 వార్హెడ్లు ఎప్పుడైనా ఉపయోగించేలా సైనిక నిల్వలలో రెడీగా ఉంచారు. సిప్రి అధికారికంగా ప్రకటించిన ఆ 9 అణుదేశాల జాబితా, మోహరించిన ఆయుధాల వివరాలు ఇవే..
రష్యా 1,796 (ప్రపంచంలోనే టాప్)
అమెరికా (USA) 1,770
ఫ్రాన్స్ 280
యునైటెడ్ కింగ్డమ్ (UK) 120
చైనా 34
భారతదేశం 12
పాకిస్థాన్ నిల్వలు ఉన్నాయి (మోహరింపు అంచనా లేదు)
ఉత్తర కొరియా నిల్వలు ఉన్నాయి
ఇజ్రాయెల్ నిల్వలు ఉన్నాయి
ప్రపంచ దేశాలు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించుకోవడానికి లేదా తమ జాతీయ శక్తిని చాటుకోవడానికి దౌత్య మార్గాలను పక్కనబెట్టి, అణ్వాయుధాలపై ఎక్కువగా ఆధారపడటం ప్రమాదకర సంకేతమని సిప్రి ఈ సందర్భంగా హెచ్చరించింది.
- Tags
- china
- india
- Nuclear Weapons
- Russia
- SIPRI
తాజావార్తలు
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!