Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..
- మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు..
- బీజేపీ ఫిర్యాదుతో రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ..
- మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కీలక మలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.. మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెపై తెలంగాణలో నమోదైన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల అధికారులు, నామినేషన్ పత్రాల్లో పూర్తి సమాచారం అందించలేదని భావించి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు సమాచారం. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్ కేసులు సహా అన్ని వివరాలను అఫిడవిట్లో తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. అలాగే నామినేషన్ తిరస్కరణపై న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం కాంగ్రెస్‌కు పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!