టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో ట్రిప్ లకు వెళ్తాడన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో వేకేషన్ లో ఉన్నారు. మొన్నీమధ్య ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కాడు.. అయితే ఎప్పుడు మహేష్ ఫ్యామిలీ తో దుబాయ్ ట్రిప్ కు వెళ్తుంటాడు.. కానీ ఇప్పుడు ప్లేస్ మార్చాడు.. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్ లో ఉన్నారు.. ప్రస్తుతం సితార, గౌతమ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
మహేష్ బాబుకు ఈ ప్రాంతం అంటే కూడా చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.. సమయం దొరికినప్పుడల్లా కూడా ఫ్యామిలీని తీసుకుని అక్కడకు వెళ్తుంటాడు. బయట మంచులో సితార, గౌతమ్‌లు ఇద్దరూ కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫోటోలు చూస్తే తెలుస్తోంది. ఇక మంచులో సితార, గౌతమ్‌లు పోజుల ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఆ ఫోటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి..
మహేష్ బాబు పిల్లలు సితార గౌతమ్ ఇద్దరికీ కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. గౌతమ్ కంటే సితార నెట్టింట్లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది.. ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంది.. అలాగే నమ్రత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయి.. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం..