Rahul Gandhi: ప్రముఖ జ్యోతిష్యురాలు, ఆస్ట్రో శర్మిష్ట ఇటీవల చాలా ఫేమస్ అయ్యారు. గత నెలలో ఎయిర్ ఇండియా ప్రమాదానికి కొన్ని వారాల ముందు, ప్రమాదాన్ని అంచనా వేయడంతో ఒక్కసారిగా శర్మిష్ట పేరు మారుమోగింది. దీంతో ఒక్కసారిగా ఈమె దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు. 2025లో ప్రపంచంలో పెద్ద విమానాలు జరగబోతున్నాయని అక్టోబర్ 2024 ముందే మొదటిసారిగా ఆమె ప్రిడిక్ట్ చేశారు. ఇదే విషయాన్ని జూన్ 5, 2025న మరోసారి అంచనా వేశారు. ఆమె అంచనా వేసిన, కొన్ని రోజులకు అంటే జూన్ 12న ఎయిర్ ఇండియా ఘోర దుర్ఘటన జరిగి 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే కాకుండా, ఆమె ఇరాన్-ఇజ్రాయిల్ సంఘర్షణను కూడా అంచనా వేశారు.
Read Also: Chhangur Baba: హిందూ మహిళల మతమార్పిడికి ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఆమె రాహుల్ గాంధీ జాతకం గురించి విశ్లేషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీకి ప్రస్తుతం కెరీర్లోనే మంచి దశ నడుస్తోందని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 99 స్థానాలు రావడం ఆయన కెరీర్లోనే బెస్ట్ నెంబర్ అని శర్మిష్ట చెప్పారు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత. రాహుల్ గాంధీకి 2027లో బుధ దశ అంతరదశ, మొదటి దశ ప్రారంభం అవుతుందని, అక్కడ నుంచి ఆయన పతనం నెమ్మదిగా ప్రారంభం అవుతుందని అంచనా వేశారు. 2029 లోకసభ ఎన్నికల సమయంలో ఆయన జాతకంలో ‘‘కేతువు’’ దశ ప్రారంభమవుతుందని చెప్పారు. కేతు ప్రత్యంతర దశలో, కేతువు ఒంటరితనం, ఆధ్యాత్మికత వంటికి ఇస్తారని చెప్పారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండకపోవచ్చని ఆమె అంచనా వేశారు. ప్రధాని అవ్వడం కూడా కష్టమని చెప్పారు.
Leave a message for Rahul Gandhi on his Birthday. SHARE – COMMENT – LIKE
Full Video👉 https://t.co/Q48WzhxGd8 pic.twitter.com/mJCxvBisuX— Astro Sharmistha (@AstroSharmistha) June 19, 2025