Karthika Deepam: వందేళ్ల నిరీక్షణకు తెర.. తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వందేళ్ల తర్వాత కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో శనివారం సాయంత్రం సరిగ్గా 5 గంటలకు కొండపై ఉన్న ‘దీపతూన్’ రాతి స్తంభంపై వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా దీపాన్ని వెలిగించారు. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు కొండ కింద వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తజన సంద్రంగా మారింది. దీపం వెలగగానే భక్తులు ఆనందంతో కేరింతలు కొడుతూ, బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
అసలు కార్తీక పౌర్ణమి రోజైన నవంబర్ 24నే ఇక్కడ దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, శాంతిభద్రతల కారణాలను చూపుతూ తమిళనాడు ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలు చేయకుండా పాత ప్రదేశంలోనే దీపం వెలిగించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, శుక్రవారం రాష్ట్ర అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడంతో పాటు శనివారం సాయంత్రం ఖచ్చితంగా దీపతూన్ వద్ద దీపం వెలిగించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఆలయ ట్రస్ట్ బోర్డును సస్పెండ్ చేసి, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్లతో కూడిన 13 మంది సభ్యుల కమిటీని నియమించింది.
Also Read
కొండపై శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతను సుప్రీంకోర్టు నేరుగా కేంద్ర బలగాలకు (CRPF) అప్పగించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు కొండను తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కొండపైకి కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. మరోవైపు, కొండపై ఉన్న దర్గాలో ముస్లిం భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొండ రక్షణకు వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్లపై స్థానికులు, భక్తులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి తెరపడుతూ సుప్రీంకోర్టు జోక్యంతో కొండపై దీపం వెలగడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తాజావార్తలు
-
Karthika Deepam: వందేళ్ల నిరీక్షణకు తెర.. తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం..
-
Mallikarjun Kharge : రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం..
-
Ram Charan: నేషనల్ అవార్డు రేస్‌లో రామ్ చరణ్
-
Tollywood : మన హీరోలు కొత్త కథలు చేయలేరా?
-
Italy Govt: పాఠశాలలో బురఖా, నిఖాబ్ నిషేధం.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!