AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో మొత్తం 9,523 పోలింగ్ స్టేషన్ లొకేషన్ల పరిధిలో 40,569 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 1,840 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా (హైపర్ సెన్సిటివ్), 2,043 కేంద్రాలను సెన్సిటివ్ గా గుర్తించిన పోలీసులు, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. హైపర్ సెన్సిటివ్ కేంద్రాల వద్ద 9,048 మంది, సెన్సిటివ్ కేంద్రాల వద్ద 8,164 మంది సిబ్బందిని భద్రత కోసం కేటాయించారు. మిగిలిన 5,689 సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా తగినంత బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మొత్తం 33,647 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. ఇందులో 29 మంది ఎస్పీలు, 48 మంది అదనపు ఎస్పీలు, 140 మంది డీఎస్పీలు, 721 మంది సీఐలు/ఆర్ఐలు, 1,507 మంది ఎస్ఐలు/ఆర్ఎస్ఐలు, 2,911 మంది ఏఎస్ఐలు/ఏఆర్ఎస్ఐలు విధుల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు 5,225 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 17,076 మంది కానిస్టేబుళ్లు, 5,990 మంది హోమ్ గార్డులు, ఇతర విభాగాలకు చెందిన 864 మంది యూనిఫాం సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.
Also Read
- Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
- Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
- Ambati Rambabu : ఋషికొండపై విమర్శలు కాదు.. విచారణ చేయండి
- Karthika Deepam: వందేళ్ల నిరీక్షణకు తెర.. తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం..
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 94 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలను (1,974 మంది సిబ్బంది) రంగంలోకి దించారు. అలాగే నిరంతర పర్యవేక్షణ కోసం 3,620 మంది సిబ్బందితో 1,810 రూట్ మొబైల్స్, 3,672 మందితో 737 స్ట్రైకింగ్ మరియు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. అక్రమ రవాణా, డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు 1,643 మంది సిబ్బందితో 278 చెక్ పోస్టులు, ఎస్ఎస్టీ బృందాలను, అదనంగా 113 రోప్ పార్టీలను నియమించి ఎన్నికల బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Crazy Crossover: సూర్య కోసం మమిత ‘ప్రేమలు’కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే ‘సీన్’లోకి నస్లెన్!
-
Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
-
Visakhapatnam: కైలాసగిరి వద్ద స్కూల్ బస్సు ప్రమాదం.. డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ ఆరా!
-
Monkey Riding Dog : కుక్క వీపుపై కోతి స్వారీ.. కురవిలో ఆసక్తి రేపిన వింత దృశ్యం
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!