Mallikarjun Kharge : రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం..
- కేంద్రంపై ఖర్గే సంచలన ఆరోపణలు
- ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఆందోళన
- ఎన్నికల సంఘం తీరుపై అభ్యంతరం
- పునర్విభజనకు సమిష్టిగా వ్యతిరేకత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశం అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదకరమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి, మొత్తం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో 400 సీట్లు దాటుతామని చెప్పినప్పటికీ ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారని, ఇప్పుడు సీట్ల సంఖ్యను 850కి పెంచి శాశ్వతంగా అధికారంలో కొనసాగాలని చూస్తున్నారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ప్రస్తావన లేదని ఆందోళన
తాజా డీలిమిటేషన్ బిల్లులో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోలేదని ఖర్గే అన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ వర్గాలు అన్యాయానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు అలాగే స్వయంప్రతిపత్తి జిల్లాల్లోని ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా పెరిగితే వాటికి కేటాయించే రిజర్వుడు సీట్ల సంఖ్య కూడా పెరగాలని, కానీ సవరణలు చేసిన ప్రతిపాదిత బిల్లులో ఆ ప్రస్తావనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026 జనగణన ఇంకా జరగాల్సి ఉన్నా ప్రభుత్వం దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని అన్నారు.
Also Read
- Italy Govt: పాఠశాలలో బురఖా, నిఖాబ్ నిషేధం.. కీలక బిల్లుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం..
- Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
- Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
- Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదం.. పాఠశాల పక్కన భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థులు మృతి..
ఎన్నికల సంఘం తీరుపై అభ్యంతరాలు.. పునర్విభజనపై అనుమానాలు
కొత్త జనగణన ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు రావాల్సి ఉంటుందని, కానీ ఆ వాటా ఇవ్వకుండా తమకు నచ్చిన విధంగా సీట్లు కేటాయించుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఖర్గే ఆరోపించారు. పది కోట్లకు పైగా ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘానికే నియోజకవర్గాల పునర్విభజన బాధ్యత అప్పగించడాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, ఆయన నాయకత్వంలో ఈ ప్రక్రియ జరిగితే మరిన్ని అక్రమాలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. తమకు అనుకూలంగా జనరల్ స్థానాలను రిజర్వుడుగా, రిజర్వుడు స్థానాలను జనరల్‌గా మార్చుకునే అవకాశం ఉంటుందని, ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో నిష్పక్షపాతంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు. అస్సాం, జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన ఎలా జరిగిందో అందరూ చూశారని అన్నారు.
పార్టీల చీలిక.. ‘ఇండియా’ కూటమి సమిష్టి వ్యతిరేకత
గత ఏప్రిల్‌లో ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చినప్పుడు ఆమోదం పొందలేదని, ఆ తర్వాత వివిధ రాజకీయ ఎత్తుగడలతో సిద్ధమయ్యారని ఖర్గే ఆరోపించారు. ముందుగా టీఎంసీ, ఆ తర్వాత ఎన్సీపీ, శివసేనను చీల్చి, ఒక్కొక్క పార్టీని విడగొట్టి నాయకులను వేరు చేస్తూ అవసరమైన సంఖ్యాబలం కోసం వేచి చూశారని అన్నారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను 850కి పెంచితే దేశానికి ఎంతటి నష్టం జరుగుతుందో కొందరికి అర్థం కావడం లేదని, ఒకసారి అధికారం పూర్తిగా చేతిలోకి వెళ్తే రాజ్యాంగాన్ని కూడా మార్చగలరని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చూస్తుంటే చైనా తరహాలో శాశ్వతంగా అధికారంలో ఉండాలని చూస్తున్నట్లు కనిపిస్తోందని, కృత్రిమ మెజారిటీతో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసి దేశాన్ని శాశ్వతంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ చేతుల్లో ఉంచాలని, చివరికి మనుస్మృతిని అమలు చేయాలన్నదే వారి లక్ష్యమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును సమిష్టిగా తీవ్రంగా వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు ఖర్గే తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!