ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం అత్యున్నత సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని మోడీకి ప్రధాన కార్యదర్శి ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. బుధవారం నుంచి ట్రంప్ విధించిన 50 శాతం సుంకం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందు పీఎంవో కీలక సమావేశం నిర్వహిస్తోంది. అధిక సుంకాలు కారణంగా ఎదురయ్యే సమస్యల గురించి చర్చించనున్నారు. 50 శాతం సుంకాలు కారణంగా సమస్యలు తలెత్తుతాయని భారత్ భావిస్తోంది. వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రత్యేక రసాయనాలు, పలు కీలక రంగాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: India-Pakistan: దాయాది దేశానికి భారత్ కీలక అలర్ట్.. వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిక
భారత్‌పై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. ఇది ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చింది. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు మరో 25 శాతం జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతో ఆసియాలోని భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతోనే ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి పుతిన్ ముందుకు రావడం లేదని అమెరికా వాదిస్తోంది. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే దేశాలపై జరిమానా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే రష్యా దగ్గర చైనా కూడా చమురు కొనుగోలు చేస్తోంది. కానీ చైనాపై మాత్రం జరిమానా విధించలేదు. కేవలం భారత్‌పైనే భారీ సుంకం విధించారు. చమురు ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడే కొనుగోలు చేస్తామని భారత్ స్పష్టం చేసింది. మొత్తానికి సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇది కూడా చదవండి: Supreme Court: దివ్యాంగులపై జోకులేంటి? కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్