PM Modi: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో పీఎం మోడీ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాలకు హాజరుకాబోతున్నారు. సెమికండక్టర్ ప్రాజెక్టులతో సహా మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకస్థాపన చేయనున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, హర్యానాలో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేని ప్రారంభించనున్నారు.