IIT Kharagpur Turns 75: దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర.. 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ ప్రశంసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Kharagpur Turns 75: భారతదేశ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల రంగాల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT Kharagpur) కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోనే తొలి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా గుర్తింపు పొందిన ఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంస్థ గత 75 ఏళ్లలో దేశ పరివర్తనలో విశేషమైన పాత్ర పోషించిందని ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఉన్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ ఆడిటోరియంలో విద్యార్థులతో ప్రధాని మోడీ ముఖాముఖి మాట్లాడారు. ’75 Voices for Viksit Bharat’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ముచ్చటించి వారి ఆలోచనలు, ఆవిష్కరణలను తెలుసుకున్నారు.
ఎడ్లబండి నుంచి బుల్లెట్ రైలు వరకు.. భారత్‌లో ఎన్నో మార్పులు!
ఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గత 75 ఏళ్లలో భారత్ ఎన్నో మార్పులను చూసింది. ఎడ్లబండి ప్రయాణం నుంచి బుల్లెట్ రైలు వరకు, ఉత్తరాల నుంచి సోషల్ మీడియా వరకు దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ప్రతి మార్పులోనూ దేశంలోనే తొలి ఐఐటీగా ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర పోషించింది” అని పేర్కొన్నారు. ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేసిన అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు.
Also Read
- MP Nishikant Dubey: ఏంటి!! మారుతి అసలు యజమాని సోనియా గాంధీ హా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..
- Supreme Court on Cousin Marriages: దగ్గరి బంధువుల మధ్య వివాహాలపై కొత్త చట్టం?.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
- Neena Gupta: 70 ఏళ్లుగా పరిష్కారం కాని గణిత సమస్యకు సమాధానం కనుగొన్న భారతీయ మహిళ.. నీనా గుప్తా సక్సెస్ స్టోరీ!
- MLA VS Babu De*ath Mystery: కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు మృతిపై అనుమానాలు.. తెరపైకి సంచలన ఆరోపణలు
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని.. విద్యార్థి జీవితంలో గుర్తుండిపోయే అనుభవాల గురించి ప్రస్తావించారు. “ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని కొన్ని జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇతర విద్యాసంస్థల్లో హాస్టళ్లు ఉంటే, ఇక్కడ ప్రత్యేకంగా హాల్స్ ఉంటాయి. ప్రతి విద్యార్థికి తమ హాల్‌పై ప్రత్యేకమైన గర్వం ఉంటుంది. అది ఈ సంస్థ ప్రత్యేకత” అని మోడీ అన్నారు. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు గుర్తుగా డిటెన్షన్ క్యాంప్
ఐఐటీ ఖరగ్‌పూర్ ఉన్న ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. గతంలో ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను నిర్బంధించే డిటెన్షన్ క్యాంప్ ఉండేదని పేర్కొన్నారు. “ఇక్కడి నుంచే అనేక ఆలోచనలకు బలం లభించింది. జాతీయోద్యమానికి స్ఫూర్తి కలిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలోని డిటెన్షన్ క్యాంపుల్లో స్వాతంత్ర్య సమరయోధులు ఉండేవారు. వారు స్వతంత్ర భారతదేశం గురించి, దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం గురించి చర్చించి ఉంటారు. వారి ఆలోచనలు నేటికీ మనకు స్ఫూర్తినిస్తాయి” అని మోడీ వ్యాఖ్యానించారు.
ఆత్మనిర్భర్ భారత్‌కు యువత ఆవిష్కరణలు బలం
ఒకప్పుడు దేశానికి స్వాతంత్ర్యం కావాలని కలలు కన్న స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితోనే నేడు యువత దేశాన్ని స్వావలంబన దిశగా నడిపిస్తున్నారని ప్రధాని అన్నారు. “దశాబ్దాల క్రితం ఇదే ప్రాంతంలోని డిటెన్షన్ క్యాంపులు దేశానికి స్వాతంత్ర్యం కావాలని కోరుకున్న భారతీయుల సంకల్పానికి సాక్ష్యంగా నిలిచాయి. నేడు ఇదే ప్రాంతంలో ఐఐటీ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వారి ఆలోచనలు, పరిశోధనలు భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు శక్తినిస్తున్నాయి” అని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో యువత సాధిస్తున్న విజయాలు భవిష్యత్తులో భారత్‌ను ప్రపంచస్థాయిలో మరింత బలోపేతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
1951లో ప్రారంభమైన ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రస్థానం
ఐఐటీ ఖరగ్‌పూర్ 1951లో స్థాపించబడింది. దేశంలో మొట్టమొదటి ఐఐటీగా ఇది గుర్తింపు పొందింది. ఇంజినీరింగ్, సైన్స్, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణల రంగాల్లో ఎంతోమంది ప్రతిభావంతులను తయారు చేసింది. ఈ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, గవర్నర్ ఆర్.ఎన్. రవి, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తదితరులు పాల్గొన్నారు.
▪️When IIT Kharagpur began its journey, India was still in the early years of independence. The nation had not even held its first general election. At that time, India needed engineers to build its industries and infrastructure. As the country’s scientific capabilities expanded, graduates of this institution contributed to the advancement of our space and atomic energy programmes.
▪️Then came the era of information technology. As new opportunities emerged in the global economy, graduates of IIT Kharagpur strengthened India’s software industry and went on to lead some of the world’s largest companies.
▪️Across every era, this institution has remained at the forefront of fulfilling its responsibility towards nation-building.
-Prime Minister @narendramodi at the Platinum Jubilee celebrations of IIT Kharagpur
#IITKharagpur @PMOIndia
— PIB India (@PIB_India) November 21, 2026
తాజావార్తలు
-
IIT Kharagpur Turns 75: దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర.. 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ ప్రశంసలు!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
-
MP Nishikant Dubey: ఏంటి!! మారుతి అసలు యజమాని సోనియా గాంధీ హా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..
-
Sara Tendulkar Wedding: శుభ్‌మన్ గిల్ కాదు.. యువ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి?
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..