PM Modi Review: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ప్రధాని మోడీతో రక్షణశాఖ కార్యదర్శి కీలక భేటీ
- భారత్- పాకిస్తాన్ మధ్య భగ్గుమంటున్న సంబంధాలు..
- ప్రధాని మోడీతో రక్షణ శాఖ కార్యదర్శి కీలక సమావేశం..
- రెండు రోజుల వ్యవధిలోనే 3వ సారి రక్షణశాఖతో ప్రధాని మోడీ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Review: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. అలాగే, తదుపరి చర్యలపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఇవాళ (మే 5న) రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంతో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రధాన మంత్రి- రక్షణ శాఖ ఉన్నతాధికారుల మధ్య జరిగిన మూడవ అత్యున్నత స్థాయి మీటింగ్ అని చెప్పొచ్చు.
Read Also: Tourist Family Review: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రివ్యూ.. మనుషులు ఉంటేనే మంచోళ్లు!
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
అయితే, పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు ప్రధాని మోడీ. లక్ష్యాలు, దాడి సమయం త్వరలోనే నిర్ణయిస్తామని సీసీఎస్ తెలిపింది. తాజాగా, యూపీలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండిగ్, టేకాఫ్ విన్యాసాలను కొనసాగించింది. ఇక, వరుసగా నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి, తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్.. మోడీతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈరోజు రక్షణశాఖ కార్యదర్శి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: Undavalli Arun Kumar: ఐపీఎస్ పీఎస్సార్ అరెస్ట్‌పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..
కాగా, ఉగ్రదాడి తర్వాత భారత్ ఇప్పటి వరకు సైనికంగా బదులివ్వలేదు.. పాకిస్థాన్‌ను అష్టదిగ్బంధం చేస్తోంది. సింధు జలాలను నిలిపివేయడంతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే.. బగల్హార్ జలాశయం నుంచి నీటి సరఫరాను ఆపేసింది భారత్. అలాగే, విద్యుద్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు నుంచి నీరు వదలకపోవడంతో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు సాగు నీరు అందడం లేదు. ఇక, జీలం నదిపై ఉన్న కిషన్‌గంగ జలాశయం నుంచి కూడా నీటిని పాక్‌కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని మోడీ సర్కార్ యోచిస్తోంది. కాశ్మీర్‌లోని రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తుండటంతో పాక్‌కు ఊపిరి సలపడం లేదని చెప్పాలి.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!