Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
- 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
- నీట్, ఆయోద్యపై హాట్ హాట్‌గా జరిగే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆగస్టు 13 వరకు సుమారు మూడు వారాల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగ్స్ నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ (CCPA) తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సాధారణంగా వర్షాకాల, శీతాకాల సమావేశాలు నాలుగు వారాల పాటు జరిగి 20 సిట్టింగ్స్ ఉంటాయి. అయితే గతంలో కొన్ని సందర్భాల్లో తక్కువ రోజులపాటు సమావేశాలు నిర్వహించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.
హాట్‌హాట్‌గా..
అయితే ఈ వర్షాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయోధ్య రామమందిర విరాళాల స్కామ్‌పై దుమారం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ విజయాల అనంతరం జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలు ఇవి. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం)లో చోటుచేసుకున్న తిరుగుబాట్లు కూడా సమావేశాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.
Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
టీఎంసీకి చెందిన 20 మంది, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపులుగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ విజ్ఞప్తిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే తిరుగుబాటు చేసిన ఎంపీలకు లోక్‌సభలో సీట్ల కేటాయింపుపై కూడా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇక రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడంతో అధికార ఎన్డీఏ కూటమి బలం మరింత పెరిగింది.
కీలక బిల్లులు
వర్షాకాల సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన)ను సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లులో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యుల సంఖ్యను 50 శాతం పెంచే ప్రతిపాదన కూడా ఉండొచ్చని సమాచారం.
ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లుపై కమిటీకి ఇచ్చిన గడువు పొడిగింపుకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎఫ్సీఆర్ఏకు సంబంధించిన వివాదాస్పద సవరణలు కూడా సమావేశాల్లో వచ్చే అవకాశముంది. అదనంగా వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు, యాంటీ డోపింగ్ సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, కార్పొరేట్ చట్ట సంస్కరణలు, సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ వంటి బిల్లులను కూడా ప్రభుత్వం ఆమోదం కోసం ప్రవేశపెట్టే అవకాశముంది.
ప్రతిపక్షం వ్యూహం
ఇక ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా..
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల
ద్రవ్యోల్బణం
నిరుద్యోగ సమస్య
వంటి అంశాలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తీవ్ర రాజకీయ వాగ్వాదాలకు వేదిక కానున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!