Tourist Family Review: ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రివ్యూ.. మనుషులు అంటేనే మంచోళ్లు!
Rating : 3.5 / 5
- MAIN CAST: శశికుమార్, సిమ్రాన్, మిథున్ జైశంకర్, కమలేష్, యోగిబాబు తదితరులు
- DIRECTOR: అభిషణ్ జీవింత్
- MUSIC: సియాన్ రోల్డన్
- PRODUCER: నజెరాత్ పసిలియన్ - మగేష్ రాజ్ పసిలియన్ - యువరాజ్ గణేశన్
మే 1వ తేదీన తెలుగులో నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాతో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో కూడా తమిళ భాషతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే అలాంటి స్టార్ హీరో సినిమా వస్తున్న సమయంలో తమిళంలో ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. సూర్య సినిమా టాక్ కొంచెం తేడాగా రావడంతో పాటు ఈ సినిమాకి అద్భుతమైన మౌత్‌టాక్ రావడంతో ఈ సినిమా మీద అందరి దృష్టి పడింది. నిజానికి ఈ సినిమాలో సిమ్రాన్ ఒక్కటే తెలుగు వారికి తెలిసిన ముఖం. శశి సినిమాలు కూడా కొన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి కొంత పరిచయమే, కానీ సినిమా అద్భుతం అనే మాట కారణంగా ఈ సినిమా చూసేందుకు స్వతహాగా నేను ఆసక్తి కనబరిచాను. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకునే అవకాశం ఉంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం రివ్యూ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను.
టూరిస్ట్ ఫ్యామిలీ కథ:
ధర్మదాస్ (శశి) తన భార్య (సిమ్రాన్), ఇద్దరు కొడుకులతో కలిసి అక్రమంగా శ్రీలంక నుంచి భారతదేశానికి వలస వస్తాడు. తన బావమరిది (యోగి బాబు) ప్రోత్సాహంతో చెన్నైలోని ఒక కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకుంటాడు. ఈ కాలనీ అయితే చుట్టుపక్కల వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు కాబట్టి మీకు సేఫ్ అనే ఉద్దేశంతో యోగి బాబు అక్కడ వీరిని సెట్ చేసే పనిలో ఉంటాడు. చుట్టుపక్కల వారు పలకరించినా పలకరించవద్దు అని తన చెల్లి కుటుంబానికి సూచనలు చేస్తాడు. అయితే అందుకు భిన్నంగా ధర్మదాస్ సహా అతని కుటుంబ సభ్యులందరూ ఇతర కుటుంబాలతో బాగా సన్నిహితం అయిపోతారు. అనుకోకుండా ధర్మదాస్ ఫ్యామిలీ ఒక బాంబు బ్లాస్ట్‌కి కారణమని పోలీసులు వారిని వెతికే పనిలో పడతారు. మరి ఈ కుటుంబం పోలీసులకు దొరుకుతుందా? నిజంగానే ఈ ఫ్యామిలీ బాంబ్ బ్లాస్ట్‌కి కారణమైందా? చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read
విశ్లేషణ:
మనుషులు మంచోళ్లు, అసలు మనుషులు అంటేనే మంచోళ్లు అని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రేలంగి మామయ్య పాత్ర పలికినా, మాయమైపోతున్నామ్మా మనిషన్నవాడు అని అందెశ్రీ పాట రాసినా రెండూ దాదాపు నిజమే. అలా మనుషుల్లో ఉన్న మానవతా విలువలను తట్టి లేపే ప్రయత్నంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా దర్శకుడు ఒక యూట్యూబర్. అతను ఇలాంటి ఒక ప్రయోగం చేయడం అభినందనీయం. శ్రీలంక నుంచి పారిపోయి ఇల్లీగల్‌గా ఇండియా వచ్చిన ఒక కుటుంబం ఒక కాలనీలో సెటిల్ అవుతుంది. నిజానికి ఆ కాలనీలో పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో జనం ఫాస్ట్ లైఫ్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. అలాంటి కాలనీలోకి వచ్చిన ఈ కుటుంబం కారణంగా ఆ కాలనీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే విషయాన్ని చాలా హృద్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. హ్యూమర్ విత్ హ్యూమానిటీ అనే ఒక సరికొత్త జానర్‌తో ప్రయత్నించి అటు కామన్ ఆడియన్స్‌తో పాటు విశ్లేషకులను సైతం కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. నిజానికి మన ఆడియన్స్ హ్యూమర్ ఎంజాయ్ చేసినంత బాగా హ్యూమానిటీ యాంగిల్ ఉన్న సినిమాలను ఎంజాయ్ చేయలేరు, కానీ ఈ సినిమాని మాత్రం ఒకపక్క హ్యూమర్‌తో మరోపక్క హ్యూమానిటీని బ్యాలెన్స్ చేసిన విధానం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. నిజానికి సాధారణంగా ప్రతి మనిషి మంచోడే, కానీ ఆ మనిషి మంచితనం బయటకు వచ్చే పరిస్థితి మాత్రం ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే పక్కింటి వాళ్లు ఏం చేస్తున్నారో కూడా తెలియనంత బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అలాంటి వాళ్లందరి జీవితాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుని ఆ మానవతా విలువలను ఎలా తట్టి లేపారు అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమాని రూపొందించారు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి నుంచి సినిమా మనల్ని నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, మనసుల్ని తడిమేస్తూ, ఒక్కోసారి అప్రయత్నంగానే కన్నీటిని జారవిడిచేలా చేస్తూ సాగుతుంది.
నటీనటుల విషయానికి వస్తే:
శశి ఒక బరువైన తండ్రి పాత్రలో ఇమిడిపోయాడు. అతనికి ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు, కానీ కొన్ని సీన్స్‌లో నటన మాత్రం అత్యద్భుతం. ఈ మధ్య ఒక ఫంక్షన్‌లో సిమ్రాన్ ఖాళీగా కూర్చోవడం కంటే ఆంటీ రోల్స్ చేయడం బెటర్ అంటూ మాట్లాడిన మాటలు ఎంత పెద్ద సంచలనానికి దారితీశాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఆమె అలాంటి ఒక ఆంటీ పాత్రలోనే కనిపించింది, కానీ తన నటనతో జీవించేసింది. ఇక ఈ సినిమాలో చిన్న కొడుకు పాత్రలో నటించిన బుడ్డోడు ఈ షో మొత్తానికి ప్రధాన ఆకర్షణ. అతని టైమింగ్, పంచ్‌లు కడుపుబ్బా నవ్విస్తాయి. పెద్ద కొడుకు పాత్ర చేసిన నటుడు కూడా కొన్ని సీన్స్‌లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇక కాలనీవాసులతో పాటు కానిస్టేబుల్ పాత్రలో నటించిన నటుడు కూడా తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. నిజానికి ఈ సినిమాకి పెద్దగా బడ్జెట్ అవసరం లేదు. చాలా లిమిటెడ్ బడ్జెట్‌తో సినిమా పూర్తి చేయొచ్చు. ఆ విషయంలో టీం సక్సెస్ అయింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక రకమైన ప్లెజెంట్ ఫీల్ తీసుకురావడంలో సక్సెస్ అయింది. అదే విధంగా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితీరు సినిమా మొత్తం కనిపించింది. వారి కష్టాన్ని మెచ్చుకోకుండా ఉండలేను. ఇక సంగీతం సినిమాని ఎలివేట్ చేయడంలో బాగా సక్సెస్ అయింది. నిజానికి నిడివి కూడా రెండు గంటల నాలుగు నిమిషాలే ఉండడం సినిమాకి బాగా ప్లస్ అయింది. దర్శకుడికి ఇది మొదటి సినిమానా ? అని అనుమానం కలిగించేలా సినిమా ఉందంటే, ఎంతగా దానిమీద వర్క్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.
ఫైనల్లీ:
ఈ ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ని కచ్చితంగా ఒకసారి థియేటర్‌కి వెళ్లి చూసి వచ్చేయండి. (తమిళం రాకపోయినా సబ్‌టైటిల్స్ ఉంటాయి).
భార్గవ్ చాగంటి
తాజావార్తలు
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!