EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
- 31 లక్షల ఇనాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో రూ. 9,330 కోట్ల డబ్బు
- ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాలు
- ఖాతాలు విలీనం చేయకపోవడమే ప్రధాన కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగుల సొమ్ము పేరుకుపోయి ఉంది. ఇన్‌యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము వేల కోట్లలో ఉన్నట్లు తేలింది. సుమారుగా 31 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాల్లో రూ. 9330 కోట్లకు పైగా ఉద్యోగుల సొమ్ము ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఈపీఎఫ్ స్కీమ్ -2026ను అమలులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 31, 2026 నాటికి దేశవ్యాప్తంగా 30,91,862 ఇనాపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నాయని EPFO వెల్లడించింది. ఉద్యోగులు ఉద్యోగం మారడం, అకౌంట్లను విలీనం చేయకపోవడం లేదా అకౌంట్లలో ఉన్న డబ్బును క్లెయిమ్ చేయకపోవడం వంటి కారణాలతో ఈ నిధులు చాలా ఏళ్లుగా ఖాతాల్లోనే ఉన్నాయి.
మార్చి 2025 నాటికి 31.38 లక్షల ఖాతాల్లో రూ. 10,181 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉండగా, 2026లో ఖాతాల సంఖ్య సుమారుగా 92 వేల మేర తగ్గి, అకౌంట్లలో ఉన్న డబ్బు రూ. 851 కోట్లకు తగ్గి రూ. 9330 కోట్లకు చేరింది. అయినప్పటికీ ఇంకా క్లెయిమ్ చేయని డబ్బు భారీగానే ఉంది. ఈ అన్‌క్లెయిమ్ డబ్బుతో ఏకంగా మూడు ఐఐటీలను నిర్మించొచ్చు. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం పథకం ఉడాన్‌పై ఖర్చు చేసిన దానికి దాదాపుగా సమానం. ఆయుష్మాన్ భారత్–PM-JAY 2026-27 వార్షిక కేటాయింపుతో కూడా దాదాపు సమానంగా ఉంది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, గత ఆరు ఆర్థిక సంవత్సరాల ఇనాపరేటివ్ ఖాతాల వివరాలనున కోరగా, 2025-26లోనే ఇనాపరేటివ్ అకౌంట్స్ సెల్ ఏర్పాటు చేసినందున అంతకుముందు సంవత్సరాల వివరాలు తమ వద్ద లేవని ఈపీఎఫ్ఓ తెలిపింది. జూన్ 29 నుంచి కొత్త ఈపీఎఫ్ స్కీమ్ -2026 అమలులోకి వచ్చింది. దాదాపు 8 కోట్ల మంది యాక్టివ్ ఈజీఎఫ్ఓ సభ్యులకు మరింత డిజిటల్, సరళమైన సేవల్ని అందించడానికి ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!