IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
- భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్
- జూలై 4న మాంచెస్టర్ వేదికగా రెండో టీ20
- రెండో టీ20లో సంజు అవుట్, వైభవ్ ఇన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing 11 vs ENG 2nd T20: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇప్పుడు జూలై 4న మాంచెస్టర్ వేదికగా జరగనున్న రెండో టీ20పై అందరి దృష్టి నిలిచింది. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతుండగా.. భారత జట్టులో మార్పులు ఉంటాయా?, ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి అంతర్జాతీయ అరంగేట్రం అవకాశం దక్కుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
వైభవ్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు:
ఐపీఎల్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ బెంచ్‌కే పరిమితమైన అతడికి.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు బుడ్డోడికి అనుకూలంగా కనిపిస్తున్నాయి. వరుసగా విఫలమవుతున్న సంజు శాంసన్ స్థానంలో వైభవ్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
సంజు పేలవ ఫామ్:
టీ20 ప్రపంచకప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ ఇటీవల మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 5, 0 పరుగులు మాత్రమే చేసిన సంజు.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవలం ఒకే పరుగు చేసి నిరాశపరిచాడు. అతడి ప్రతిభపై ఎలాంటి సందేహాలు లేకపోయినా.. నిలకడలేని ప్రదర్శన అతడికి ప్రతికూలంగా మారింది. దీంతో రెండో టీ20లో టీమ్ మేనేజ్మెంట్ మార్పు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజు స్థానంలో బుడ్డోడు ఆడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శాంసన్‌ను పక్కనబెడితే వికెట్‌కీపర్‌గా ఇషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఒక్క మార్పు మిన్నగా బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు లేవు.
ఫామ్ అందుకున్న శ్రేయాస్, దూబే:
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అయితే ఇషాన్ కిషన్, తిలక్ వర్మలు బ్యాట్ జులిపించాల్సి ఉంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాతోనే బరిలోకి దిగింది. వీరిద్దరూ రెండో మ్యాచ్‌లో కూడా కొనసాగనున్నారు. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి జోడీ కీలక పాత్ర పోషించనుంది. అలాగే శివమ్ దూబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా.. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టుకు సమతుల్యత తీసుకురానున్నారు. మొదటి మ్యాచులో దూబే సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.
అందరి చూపు వైభవ్పైనే:
ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి రెండో టీ20లో అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా లేదా అనేది ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంజు శాంసన్ పేలవ ఫామ్, వైభవ్‌పై పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ అవకాశం లభిస్తే.. అంతర్జాతీయ వేదికపై వైభవ్ ఎలా రాణిస్తాడో చూడాలని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్ అంచనా ప్లేయింగ్ ఎలెవన్:
వైభవ్ సూర్యవంశీ
అభిషేక్ శర్మ
ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్)
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్)
తిలక్ వర్మ
శివమ్ దూబే
అక్షర్ పటేల్
హర్షిత్ రాణా
రవి బిష్ణోయ్
అర్ష్‌దీప్ సింగ్
వరుణ్ చక్రవర్తి
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు