Indian Army: మణిపూర్‌లో జరుగుతున్న హింసను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వాల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. చర్చలు జరిగినట్టు జరుగుతూనే ఉన్నాయి.. తిరిగి హింస చెలరేగుతోంది. ఎక్కడ లోపం జరుగుతుందనేది ఎవరు చెప్పడం లేదు. ఇటు ప్రజలు తమకు కావల్సిన దానిని వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడం.. వారికి ఇవ్వాల్సిన దానిపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వకపోవడంతో గత మే నెల 3 నుంచి మణిపూర్ రావణకాష్టంలాగా మండుతూనే ఉంది. ఇంతకాలం ప్రయత్నం చేసిన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు హింసను అదుపు చేయడానికి ప్రజలు సహకరించాలని ట్విట్టర్ వేదికగా కోరుతోంది. మరీ ప్రజలు వారి విన్నపాన్ని అంగీకరిస్తారా? లేదా? చూడాలి..
Read also: Harirama Jogaiah Open Letter: సీఎం జగన్‌కు హరిరామ జోగయ్య బహిరంగలేఖ.. ఆ పరిస్థితే వస్తే సీఎం ఎవరు?
మణిపూర్‌లో జరుగుతున్న హింసను అదుపు చేసేందుకు ప్రజలు సహకరించాలని ఇండియన ఆర్మీ(Indian Army) విజ్ఞప్తి చేసింది. శాంతి స్థాపన కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆర్మీ తన ట్విట్టర్‌లో కోరింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో గత రెండు నెలల నుంచి వర్గ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దాని వల్ల హింస హద్దులు దాటింది. సాయుధ దళాలు రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే స్థానిక మహిళలు తమను అడ్డుకుంటున్నట్లు ఆర్మీ తన ట్వీట్టర్ వీడియోలో తెలిపింది. మహిళలు కావాలని సాయుధులుగా ఉన్న వారికి సహకారం అందిస్తున్నట్లు పేర్కొంటుంది. భద్రతా దళాలు తమ విధులను నిర్వర్తించకుండా మహిళలు అడ్డుపడుతున్నారని ఆర్మీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఓ ప్రత్యేక వీడియోను ఆర్మీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. తమ మానవత్వాన్ని బలహీనతగా చూడరాదు అని ఆర్మీ తన వీడియోలో ప్రకటించింది.
Read also: Massage Centers: డాక్టరై హాస్పిటల్ పెట్టాలనుకుంది.. వ్యభిచారం కూపంలో అడ్డంగా దొరికింది
మణిపూర్ పరిస్థితిపై సీఎం బీరేన్ సింగ్ సోమవారం ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నదో చెప్పలేమని వ్యాఖ్యానించారు. హింస మొదటి దశ రాజకీయంగా, సున్నితంగా ఉన్నదన్నారు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతున్నదో చెప్పలేమని.. రాష్ట్రంలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో హింస స్వభావం మారిపోయిందని, మారుమూల ప్రాంతాల్లో కాల్పులు, లోయ జిల్లాల్లో పౌర అశాంతికి దారితీసిందని చెప్పారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారని సీఎం చెప్పారు. దీనికి తోడు పోలీసులు … సెర్చ్ ఆపరేషన్లలో భాగంగా 24 గంటల వ్యవధిలో 12 బంకర్లను ధ్వంసం చేశామని, ఆరు మోర్టార్ షెల్స్‌ను స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. సాహుమ్‌ఫైలోని పంట పొలాల్లో మోర్టార్ షెల్స్‌ను, బిష్ణుపూర్ జిల్లాలోని కొట్లిన్ గ్రామ సమీపంలో ఐఈడీ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకొన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి మొత్తంగా 1,100 ఆయుధాలతో పాటు 13,702 మందుగుండు సామగ్రి, 250 బాంబులను రికవరీ చేసుకొన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుస్టేషన్లు, ఆయుధాగారాల నుంచి ఎన్ని అయుధాలు లూటీకి గురయ్యాయనే దానిపై అధికారుల వద్ద స్పష్టత లేదు.