Massage Centers: డాక్టరై హాస్పిటల్ పెట్టాలనుకుంది.. వ్యభిచారం కూపంలో అడ్డంగా దొరికింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massage Centers: హైదరాబాద్‌లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్‌లోని స్పా సెంటర్‌పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులు, 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఓ అపార్ట్ మెంట్ లో నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించారు.ఈ క్రమంలో ఆదివారం రాత్రి మసాజ్ సెంటర్ పై దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడ వ్యభిచారం గుట్టు రట్టయింది. శృతి, రమణ, జహీద్ ఉల్ హక్ మసాజ్ సెంటర్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి క్రాస్ మసాజ్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. వీరితో పాటు మరో ముగ్గురు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మసాజ్ సెంటర్‌లో పట్టుబడిన యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈ స్పా సెంటర్ నిర్వాహకులపై గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కూడా దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
రెండో సారి శృతి అరెస్ట్..
మెయిన్ ఆర్గనైజర్ శృతి డాక్టర్ కావాలనుకున్న శృతి ఆగడాలు దారి మళ్ళింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శృతి డాక్టర్ కావాలి అనుకుంది. ఉక్రెయిన్ లో మెడిసిన్ సీట్ సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తి చేసిన శృతి రెండవ సంవత్సరం ఫీజు చెల్లించలేక స్వస్థలం భద్రాచలంకు వచ్చింది. అనంతరం అమీర్పేట్ లో హెయిర్ హోస్టర్ గా శిక్షణ తీసుకుంది. అదే సమయంలో బంజర్ హిల్స్ లోని ఓ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్ గాను పనిచేసింది. డాక్టర్ గా ఎయిర్ హోస్టరుగా కన్న కలలు కాకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించాలి అనుకుంది. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ తెరిచింది. అమ్మాయిలను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించింది శృతి. సమాచారం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు మసాజ్ సెంటర్ లో దాడులు చేసి నిందితురాలు శృతిని అదుపులో తీసుకుని జైలుకి పంపారు. జైల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా శృతితో మార్పు రాలేదు. బంజారాహిల్స్ లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార రాకెట్ కు తెరలేపింది. దీంతో రెండోసారి శృతి పోలీసులకు చిక్కింది. శృతితో పాటు మరో ఇద్దరిని రిమాండ్ కు తరలించారు పోలీసులు.
MLA Jagga Reddy: ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!