Off The Road: కృష్ణా జిల్లా టీడీపీలో కులాల కుంపట్లు రగులుతున్నాయా ?
- అంతా కష్టపడ్డా ఒకే కులానికి పెద్దపీట అంటూ మండిపాటు..
- బీసీల్లో కూడా ఒకే క్యాస్ట్‌ని ప్రోత్సహింస్తున్నారని అసంతృప్తి..
- గౌడ కులానికి చెందిన కొనకళ్ళకు ఆర్టీసీ ఛైర్మన్ పోస్ట్..
- వీరంకి గురుమూర్తికి గౌడ కార్పొరేషన్ ఛైర్మన్..
- గురుమూర్తికే కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి..
- జిల్లా అధ్యక్ష పదవి కోసం కమ్మ నేతల తీవ్ర ప్రయత్నాలు, నిరాశ..
- ఒకే నాయకుడికి రెండు పదవులు ఎలాగన్న చర్చ..
- అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నాల్లో సీనియర్స్..
- పదవుల్లేని వారి వర్గానికి స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లకు డిమాండ్..
- ఇక ఓపెనైపోవాలనుకుంటున్న కొందరు నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Road: పదవుల పందేరం కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోందట. మెజార్టీ పోస్ట్‌లను ఒకే కులానికి కట్టబెడుతున్నారంటూ మిగతా నాయకులు అసహనంగా ఫీలవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా సీనియర్ లీడర్స్‌కు ఇది అస్సలు మింగుడు పడని వ్యవహారంగా మారిందట. అధికారం లేనప్పుడు అన్ని సామాజిక వర్గాల నేతలు కష్టపడి పనిచేసినా… ఇప్పుడు మాత్రం ఒకే కులానికి పెద్ద పీట వేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అధిష్టానం బీసీ మంత్రం జపించడం బాగానే ఉన్నా… అందులోనూ ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేసి మిగతా వాళ్ళని విస్తరించడం ఏంటంటూ లోలోపల రగిలిపోతున్నారట. ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులను ఇచ్చినప్పుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కింది. ఆ తర్వాత పామర్రుకి చెందిన వీరంకి గురుమూర్తికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
ఇక కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని కూడా అదే సామాజిక వర్గానికి, ప్రత్యేకించి అదే వీరంకి గురుమూర్తికి ఇవ్వడంపై మిగతా నాయకులు మండిపడుతున్నారు. బీసీలకే ఇవ్వాలనుకుంటే ఆయన తప్ప జిల్లాలో ఇక బీసీ నాయకులు ఎవరూ లేదా అన్నది అసంతృప్తుల క్వశ్చన్. దీంతో పదవుల పంపకం జిల్లాలో కులాల చిచ్చు రేపుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ళ నారాయణ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక అధికారంలోకి వచ్చాక ఆ పోస్ట్ కోసం కమ్మ సామాజిక వర్గం నుంచి కొందరు సీనియర్ లీడర్స్ తీవ్రంగా ప్రయత్నించారు. తమ పలుకుబడిని అన్ని రకాలుగా వాడినా ఉపయోగం లేకపోయింది. టీడీపీ అధిష్టానం కమ్మ నేతల్ని పక్కనబెట్టి అప్పటికే ఒక పదవి ఉన్న, గౌడ సామాజిక వర్గానికి చెందిన గురుమూర్తి వైపే మొగ్గింది. దీంతో ఒకే నాయకుడికి రెండు పదవులు ఎలా ఇస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది. మరోవైపు జిల్లాలో పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గౌడ సామాజిక వర్గానికే చెందిన కాగిత కృష్ణ ప్రసాద్ ఉన్నారు .ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవికి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గద్దె అనురాధను ఎంపిక చేయడంతో… కృష్ణా పోస్ట్ కూడా తమకే ఇస్తారని కృష్ణా కమ్మ నాయకులు ఆశించినా నిరాశే మిగిలింది.
Also Read
ఇదే సమయంలో ఆల్రెడీ ఒక నామినేటెడ్ పదవి ఉన్న వీరంకి గురుమూర్తికే పార్టీ పోస్ట్ కూడా ఇవ్వడం ఏంటంటూ….కృష్ణా టీడీపీ సీనియర్స్ అంతా లోలోలప తీవ్రంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్ని పదవుల్ని ఒకే సామాజికవర్గానికి ఇవ్వడం ఏంటన్నది కొందరి క్వశ్చన్. కూటమి ధర్మంలో భాగంగా ఇప్పటికే జనసేన బిజెపి నుంచి కూడా పోటీ పెరగడంతో చాలా చోట్ల అవకాశాలు కోల్పోతున్నామని, అలాంటప్పుడు ఉన్న కొద్ది ఛాన్స్‌లు కూడా ఒకే కులం కోటాలో ఇచ్చేసి మిగతా వాళ్ళని ఎండగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ టీడీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఒకరిద్దరు సీనియర్స్ అయితే…. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అలాగే ప్రస్తుత పదవుల పంపకానికి, రాబోయే స్థానిక ఎన్నికల్లో సీట్లకు ముడి పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ, నామినేటెడ్ పదవుల పరంగా ప్రస్తుతం అన్యాయం జరిగిన వారి వర్గానికి రేపు స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దగ్గర తేల్చుకోవాలనుకుంటున్నారట కొందరు సీనియర్స్. తీవ్ర అసంతృప్తి ఉన్నా… ఇన్నాళ్లు బయటపడకుండా ఉన్న నేతలు ఇక ఓపెనైపోయి… స్థానిక ఎన్నికల నాటికి జాగ్రత్త పడాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో అధిష్టానం పెద్దలు ఎలా స్పందిస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!