Lok Sabha: బడ్జెట్ సమావేశాలు షురూ.. వక్ఫ్‌బోర్డు బిల్లుతో సహా 16 బిల్లులు.. ఏవేవంటే..!
- శుక్రవారం నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- ఫిబ్రవరి 1న బడ్జె్ట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- ఈ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఇటీవల చనిపోయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలియజేయనున్నారు. ఇక ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సమావేశాలు కూడా వాడీవేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత శీతాకాల సమావేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. అదానీ లంచాల వ్యవహారంతో ఉభయ సభలు అట్టుడికాయి. ఈ బడ్జెట్ సమావేశాలు కూడా అదే మాదిరిగా ఉండనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: GHMC Council : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస
Also Read
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలు జరుగుతున్నాయి. మొదటి సెషన్ ఫిబ్రవరి 13 వరకు జరుగుతుండగా.. రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో దాదాపు 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంతో సహా 16 బిల్లులు బడ్జెట్ సెషన్‌లో ప్రవేశపెట్టనన్నారు. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఎనిమిదో సారి శనివారం సమర్పించనున్నారు.
ఇక 2024-25 ఆర్థిక సర్వేను శుక్రవారం నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్నారు. అలాగే సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లు 2025, వక్ఫ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టానికి సవరణలు, భారతీయ రైల్వేలు, భారతీయ రైల్వే బోర్డు చట్టాల విలీనంతో సహా 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే విపత్తు నిర్వహణ మరియు చమురు క్షేత్రాల చట్టాలకు సవరణలు చేసే అవకాశం ఉన్నాయి. తీరప్రాంత మరియు మర్చంట్ షిప్పింగ్‌కు సంబంధించిన బిల్లులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్‌కు త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా పేరు మార్చాలని.. దానిని ‘‘జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ’గా ప్రకటించాలని కోరుతూ మరొక బిల్లును కూడా సమర్పించవచ్చు. ఇక విమానయాన రంగానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు.. ఇమ్మిగ్రేషన్ మరియు విదేశీయుల ప్రవేశానికి సంబంధించిన ప్రస్తుత నిబంధనలను మార్చడానికి ఉద్దేశించిన బిల్లులు కూడా ఈ సెషన్‌లో ప్రవేశపెట్టే ఛాన్సుంది. చివరగా గోవా రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం ఆశించిన మరో కీలక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: UK: బ్రిటన్ “ఇస్లామిక్ దేశం”గా మారొచ్చు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
-
Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!