Pariksha Pe Charcha: “ఒక పిల్లవాడిని మరొకరితో పోల్చకండి”.. తల్లిదండ్రులకు పీఎం మోడీ సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pariksha Pe Charcha: పిల్లల రిపోర్ట్ కార్డ్స్‌ని తమ సొంత విజిటింగ్ కార్డుగా పరిగణించొద్దని ప్రధాని నరేంద్రమోడీ విద్యార్థుల తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. సోమవారం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులు ఇతరులతో కాకుండా తమతో తాము పోటీ పడాలని సూచించారు.
పోటీ, సవాళ్లు జీవితంలో స్పూర్తిగా పనిచేస్తాయని, అయితే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని అన్నారు. ఒక పిల్లవాడిని మరొకరితో పోల్చొద్దని, అది వారి భవిష్యత్తుకు హాని కలిగించొచ్చని, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల రిపోర్ట్ కార్డును విజిటింగ్ కార్డుగా భావిస్తున్నారని, అది మంచిది కాదని ప్రధాని అన్నారు. విద్యార్థులపై తోటివారి, తల్లిదండ్రులతో పాటు స్వీయ ఒత్తిడి వంటి మూడు రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటారని చెప్పారు. కొన్ని సార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతారు, ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరుచుకుని, క్రమంగా పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రధాని సూచించారు. ఈ విధంగా మీరు పరీక్షలకు ముందే పూర్తిగా సిద్ధంగా ఉంటారన్నారు. విద్యార్థులే భారతదేశ భవిష్యత్ రూపకర్తలుగా అభివర్ణించిన మోడీ పరీక్షా పే చర్చా కార్యక్రమం తనకు కూడా పరీక్ష లాంటిదని అన్నారు.
Also Read
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
Read Also: Mallikarjun Kharge: ‘‘ముందస్తు ప్లాన్ ప్రకారమే’’.. నితీష్-బీజేపీ పొత్తుపై కాంగ్రెస్..
విద్యార్థులు గతంలో కన్నా వినూత్నంగా మారారని ప్రధాని అన్నారు. మన విద్యార్థులే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారని చెప్పారు. విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే పరీక్షా పే చర్చ గత ఆరు ఏళ్లుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించేందుకు సాయ పడుతోంది. కోవిడ్ మహమ్మారి సందర్భంగా నాలుగో ఎడిషన్ ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు. గత ఏడాది ఎడిషన్‌లో మొత్తం 31.24 లక్షల మంది విద్యార్థులు, 5.60 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.95 లక్షల మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం, MyGov పోర్టల్‌లో 2.26 కోట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి, ఇది విద్యార్థుల ఉత్సాహాన్ని సూచిస్తోంది.
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!