Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
- మహిళల టీ20 ఆసియా కప్ 2026
- ఆగస్టు 28 నుంచి దుబాయ్‌లో ఈ టోర్నమెంట్ ప్రారంభం
- భారత్- పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ఆసియా కప్ 2026కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటించింది. ఆగస్టు 28 నుంచి దుబాయ్‌లో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ పోటీలు సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్‌తో ముగుస్తాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్ చైనా, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగనుంది. టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగనున్నాయి. మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతాయి.
గ్రూప్ దశలో భారత్ మ్యాచ్‌లు
హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
Also Read
- Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
- Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ఆగస్టు 30: భారత్ vs థాయ్‌లాండ్
సెప్టెంబర్ 3: భారత్ vs హాంకాంగ్
సెప్టెంబర్ 5: భారత్ vs పాకిస్థాన్
టోర్నమెంట్ ఫార్మాట్
8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఒక్కసారి తలపడుతుంది. గ్రూప్ దశ ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
సెప్టెంబర్ 10న తొలి సెమీఫైనల్లో A1, B2తో తలపడుతుంది.
సెప్టెంబర్ 11న రెండో సెమీఫైనల్లో B1, A2తో పోటీ పడుతుంది.
సెప్టెంబర్ 13న ఫైనల్ జరుగుతుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక
గత ఎడిషన్‌లో టైటిల్ గెలిచిన శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 2018లో బంగ్లాదేశ్ కూడా ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. భారత్ మాత్రం మహిళల ఆసియా కప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. భారత్ 2012, 2016, 2022 సంవత్సరాల్లో మూడు టైటిళ్లను సాధించింది.
మహిళల ఆసియా కప్ 2026 పూర్తి షెడ్యూల్
ఆగస్టు 28 -థాయ్‌లాండ్ vs హాంకాంగ్
ఆగస్టు 29 -శ్రీలంక vs UAE
ఆగస్టు 30 -భారత్ vs థాయ్‌లాండ్
ఆగస్టు 31 -బంగ్లాదేశ్ vs ఇండోనేషియా
సెప్టెంబర్ 1 -పాకిస్థాన్ vs థాయ్‌లాండ్
సెప్టెంబర్ 2 -శ్రీలంక vs ఇండోనేషియా
సెప్టెంబర్ 3 -భారత్ vs హాంకాంగ్
సెప్టెంబర్ 4 -UAE vs ఇండోనేషియా
సెప్టెంబర్ 5 – భారత్ vs పాకిస్థాన్
సెప్టెంబర్ 6- శ్రీలంక vs బంగ్లాదేశ్
సెప్టెంబర్ 7 -పాకిస్థాన్ vs హాంకాంగ్
సెప్టెంబర్ 8 -బంగ్లాదేశ్ vs UAE
సెప్టెంబర్ 10 -సెమీఫైనల్ 1 – A1 vs B2
సెప్టెంబర్ 11 -సెమీఫైనల్ 2 – B1 vs A2
సెప్టెంబర్ 13 – ఫైనల్
Women's Asia Cup 2026: Full Schedule Announced | India vs Pakistan on September 5 #WomensAsiaCup2026 #AsiaCup2026 #TeamIndia pic.twitter.com/91syO70XqU
— Inspirexo (@Inspirexo) August 6, 2026
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!